వర్సిటీలో విచిత్రం! | In University miracle! | Sakshi
Sakshi News home page

వర్సిటీలో విచిత్రం!

Published Thu, Mar 6 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM

In University miracle!

ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: రెగ్యులర్ బోధకుల పోస్టుల భర్తీ వ్యవహారంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం అధికారుల తీరు అందరికీ ఆశ్చర్యం కలిగి స్తోంది. విద్యార్థుల ప్రయోజనం కోసం కాకుండా మరిదేనికోసమో పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. యూనివర్సిటీ అవసరాలను ప్రభుత్వానికి సరిగా నివేదించకపోవటమే ఈ దుస్థితికి కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల వివరణ ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది.
 
 ఇదీ సంగతి..
 యూనివర్సిటీలో 34 రెగ్యులర్ బోధకుల పోస్టుల భర్తీకి గత ఏడాది జూన్ 22న నోటి ఫికేషన్ విడుదల చేశారు. మరో 15 పోస్టుల భర్తీకి ఈ నెల 1న మరో నోటిఫికేషన్
 జారీ చేశారు. అయితే ఆయా కోర్సుల కు ఉన్న ఆదరణ, విద్యార్థుల సంఖ్యను పట్టించుకోకుండా పోస్టులు మంజూరవటం విస్మయం కలిగిస్తోంది.
 
 వర్సిటీలో 2009లో ప్రారంభించిన జియో సైన్స్ కోర్సుకు రెగ్యులర్ బోధకులు లేరు. మూడేళ్లు చదివితే జియో టెక్ డిగ్రీ, రెండేళ్లతో సరిపెడితే జియో ఫిజిక్స్‌లో పీరూ. డిగ్రీ ఇస్తున్నారు. ఈ కోర్సులు చేసినవారికి విదేశాల్లో కూడా మంచి ఉపాధి అవకాశా లు లభిస్తున్నాయి. ఈ విభాగానికి ఏడుగురు రెగ్యులర్ బోధకులు అవసరం కాగా ఒక్కరు కూడా లేరు. టీచింగ్ అసోసియే ట్లు, సబ్జెక్టు కాంట్రాక్టర్లతో నెట్టుకువస్తున్నారు.
 
 ఎంబీఏలో 40 సీట్లు ఉండగా ఈ ఏడాది వీటి సంఖ్యను 60కు పెంచారు. కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్(ఎంబీఏ, ఎంకాం) విభాగాలకు కలిపి ఇద్దరు రెగ్యులర్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. అయినా ఈ విభాగానికి రెగ్యులర్ బోధకులను కేటాయించలేదు.
 
  ఎంఏ(తెలుగు) కోర్సులో శతశాతం అడ్మిషన్లు జరుగుతున్నాయి. అయితే ఈ కోర్సు బడ్జెట్‌కు ఇంతవరకు ప్రభుత్వ అనుమతి కూడా లభించలేదు. దీంతో టీచింగ్ అసోసియేట్లతోనే నిర్వహి స్తున్నారు.
 
 వీటికి మాత్రం ప్రాధాన్యం..
 ఇప్పటికే నలుగురు రెగ్యులర్ బోధకులు ఉన్న బయో టెక్నాలరూ. విభాగంలో మరో మూడు పోస్టులు భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. గతేడాది ఈ కోర్సు ఫస్టియర్‌లో 17 మంది మాత్రమే చేరారు. వాస్తవానికి తొలుత ఒక్కరు కూడా చేరలేదు. కోర్సు ఫీజును సగానికి తగ్గించటంతోపాటు అర్హతల విషయంలో సడలింపులు ఇచ్చి రూ.దు జిల్లాల్లో పత్రికా ప్రకటనలు ఇచ్చాక ఈ మాత్రం అడ్మిషన్లు జరిగాయి. ఇక ద్వితీ య సంవత్సరంలో కేవలం 8 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు.
 
 రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులో 40 సీట్లు ఉండగా 18 మంది చేరారు. సెకండియర్‌లో 10 మంది మాత్రమే ఉన్నారు. ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా ప్రవేశాలు కల్పించేందుకు ఏయూలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు తొలుత ఒక్కరు కూడా హాజ రు కాలేదు. చివరికి ఇక్కడ అంతర్గత కౌన్సె లింగ్ నిర్వహించి విద్యార్థులను చేర్చుకున్నారు. ఈ విభాగంలో ఇప్పటికే సీనియర్ ప్రొఫెసర్లు ఇద్దరు ఉండగా మరో నాలుగు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు.
 
  సోషల్ వర్కులో 40 సీట్లు ఉండగా 21 సీట్లు నిండాయి. ద్వితీయ సంవత్సరంలో 19 మంది ఉన్నారు. ఈ విభాగంలో ముగ్గు రు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండగా మరో మూడు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు.
 
   మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో 65 సీట్లు ఉండగా ఫస్టియర్‌లో 46 మంది చేరారు. వీరిలో 40 మంది తొలి సెమిస్టర్ ఫీజు చెల్లించగా 33 మందే పరీక్షలు రాశారు. కేవలం ఏడుగురే రెగ్యులర్‌గా తరగతులకు హాజరవుతున్నారు. సెకండియర్‌లో 12 మంది, ఫైనలియర్‌లో నలుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మరోవైపు ఈ కోర్సుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు కూడా లేదు. అయినా ఈ విభాగంలో ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.
 
  ఎంసీఏ ఫస్టియర్‌లో 14 మంది, సెకండియర్‌లో 12 మంది, ఫైనలియర్‌లో ఒక విద్యార్థి మాత్రమే ఉన్నారు. ఈ కోర్సుకు ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోవటంతో ఇన్‌చార్జి వీసీగా భగవత్‌కుమార్ ఉన్నప్పుడు దీనిని రద్దు చేయాలని భావిం చారు. రాజాంలోని రూ.ఎంఆర్‌రూ.టీ ఇప్పటికే ఎంసీఏ కోర్సును ఎత్తివేసింది. అలాంటిది వర్సిటీలోని ఎంసీఏ విభాగంలో నలుగురు బోధకుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వటం గమనార్హం.
 
 పోస్టులను వదులుకోలేం..
 అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులను వదులుకోలేమని, కోర్సులను ఎత్తివేయలేమని వర్సిటీ రిజిస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్ చెప్పారు. ఆయా విభాగాల వైఫల్యాలపై సమీక్షించాల్సి ఉందన్నారు. బోర్డాఫ్ స్టడీస్ ఏర్పాటు చేసి కాలానుగుణంగా సిల బస్‌లో మార్పులు చేయాలన్నారు.
 
   ఉపాధి అవకాశాలు లభించేలా కోర్సులను బలోపేతం చే యటానికి, అడ్మిషన్లు పెంచటాని కి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement