సాక్షి, నల్లగొండ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్టు ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని వేములపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు డిపాజిట్లు దక్కకుండా అన్నీ నియోజక వర్గాల్లో పర్యటిస్తానని తెలిపారు.
ప్రజా వ్యతిరేక దోపిడి పాలనను అంతం చేయడానికి ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment