భువనగిరి (నల్లగొండ) : వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి జారిపడి ఓ ప్రయాణికుడు మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి మండలంలోని రాయగిరి రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. వరంగల్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైల్లో నుంచి గుర్తుతెలియని వ్యక్తి(45) జారిపడి మృతిచెందాడు. ఇది గుర్తించిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.