అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | suspicious death | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Oct 17 2016 1:59 AM | Updated on Sep 4 2017 5:25 PM

కుక్కునూరు : మండలంలోని భువనగిరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

కుక్కునూరు : మండలంలోని భువనగిరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన పెనుబల్లి సత్యనారాయణ (30) పెళ్లయిన నాటి నుంచి అత్తవారిల్లు భువనగిరి వచ్చి నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం అపస్మారకస్థితిలో నోటి నుంచి నురగలు కక్కుతూ పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు సత్యనారాయణను భద్రాచలం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. మృతికి అతని భార్య, అత్త కారణమని సత్యనారాయణ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement