జెండా ఆవిష్కరణపై నాయకుల కొట్లాట | congress leaders fight in republic day celebrations | Sakshi
Sakshi News home page

జెండా ఆవిష్కరణపై నాయకుల కొట్లాట

Published Tue, Jan 26 2016 10:31 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

congress leaders fight in republic day celebrations

భువనగిరి: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ విషయమై కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఒకరిపై ఒకరు చేయి చేసుకుని పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లారు.
 
నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. జగదేవ్‌పూర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బర్రె జహంగీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించబోతుండగా... నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంభం అనిల్‌కుమార్‌రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ జెండాను ఆవిష్కరిస్తారని చెప్పడంతో వారి మధ్య వాగ్వివాదం జరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అనంతరం కంభం అనికుమార్‌రెడ్డి పై జహంగీర్ అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement