నల్గొండ జిల్లా భువనగిరి శివారులోని పఠాన్‌చెరు స్పిన్నింగ్ మిల్లువద్ద స్కార్పియో బోల్తాపడి ఓ యువకుడు మృతి చెందాడు.
నల్గొండ: నల్గొండ జిల్లా భువనగిరి శివారులోని పఠాన్‌చెరు స్పిన్నింగ్ మిల్లువద్ద స్కార్పియో బోల్తాపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు...వరంగల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న స్కార్పియో బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ టోలీచౌకీకి చెందిన దస్తగిరి (30) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంతో మరో ఇద్దరు గాయపడ్డారు. భువనగిరి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
(భువనగిరి అర్బన్)