భువనగిరి (నల్లగొండ) : గుర్తుతెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రైలు పట్టాల మీద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని రైల్వే పోలీసులు అంటున్నారు.