దొంగ బంగారంతో బ్యాంకులకు టోకరా | Gold Appraiser Cheats Banks By Depositing Fake Gold | Sakshi
Sakshi News home page

దొంగ బంగారంతో బ్యాంకులకు టోకరా

Published Mon, Jan 18 2016 2:18 PM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM

Gold Appraiser Cheats Banks By Depositing Fake Gold

నల్లగొండ క్రైమ్: బ్యాంకులకు టోకరా వేసిన ఓ వ్యక్తిని నల్లగొండ జిల్లా భువనగిరిలో పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు... భువనగిరి పట్టణానికి చెందిన తంగెళ్లపల్లి గిరిధరాచారి హెడ్‌డీఎఫ్‌సీ, కెనరా బ్యాంకులకు గోల్డ్ అప్రెయిజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తెలిసిన వారితో నకిలీ బంగారాన్ని తాను పనిచేస్తున్న బ్యాంకు శాఖల్లో కుదువ పెట్టించి రూ. 83 లక్షల మేర రుణాలను పొందేలా చేశాడు. అలా దండుకున్న సొత్తుతో జల్సాలు చేయడం ప్రారంభించాడు. అతడిలో ఆకస్మిక మార్పును గమనించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా చారి మోసం వెలుగు చూసింది. దీంతో అతడ్ని అరెస్ట్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement