భువనగిరిలో పేలిన్‌ గ్యాస్‌ సిలిండర్‌ | gas cylinder blast in bhavanagiri | Sakshi
Sakshi News home page

భువనగిరిలో పేలిన్‌ గ్యాస్‌ సిలిండర్‌

Published Sat, Jul 1 2017 1:08 PM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

gas cylinder blast in bhavanagiri

భువనగిరి: వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో రెండిళ్లతో పాటు మూడు బైకులు కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడి సిలిండర్‌ పేలడంతో.. భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
 
చూస్తుండగానే పక్కనే ఉన్న పూరిళ్లుకు మంటలంటుకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement