
సాక్షి, భువనగిరి : యాద్రాద్రి జిల్లా భువనగి చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పరకాల డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బయలు దేరిన బస్సు.. భువనగిరి బైపాస్ రోడ్డు దగ్గరకు రాగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో కొంత మంది ప్రయాణికులు కాల్వలో పడిపోయారు. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.