
నేడు భువనగిరికి ప్రకాశ్ జవదేకర్
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనానికి కేంద్ర మానవవనరుల అభి వృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌జవదేకర్ శనివారం హాజరుకానున్నారు.
సాక్షి, హైదరాబాద్: భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనానికి కేంద్ర మానవవనరుల అభి వృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌జవదేకర్ శనివారం హాజరుకానున్నారు. ఉదయం 11గంటలకు యాదాద్రిలోని లక్ష్మీనరసింహæస్వామిని దర్శించుకుంటారు. భోజన విరామం తరువాత మధ్యాహ్నం 1.30 గంటలకు డాల్ఫిన్ హోటల్ జరిగే స్థానిక పదాధికారుల సమావేశానికి హాజరవుతా రు. తిరిగి సాయంత్రం 3 గంటలకు సాయి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొని, రాత్రి 10 గంటలకు పుణే బయలుదేరి వెళ్తారు.