భువనగిరి (నల్గొండ జిల్లా) : డ్రైవర్ నిర్లక్ష్యంతో భువనగిరి రైల్వే స్టేషన్‌లో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపేశారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇంటర్‌సిటీ, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. అంతకుముందు సికింద్రాబాద్ వైపు వెళ్లిన ఒక గూడ్సు రైలు బగిడిపల్లి ర్వైల్వే స్టేషన్‌లో సిగ్నల్ ఇవ్వకున్నా ముందుకు వెళ్లిపోవడంతో గత్యంతరం లేక అదే మార్గంలో వెళ్లనున్న రైళ్లను భువనగిరిలోనే ఆపడం జరిగింది.
గూడ్సు రైలు సికింద్రాబాద్ చేరేవరకూ ఈ రైళ్లను ఇక్కడే ఆపేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. గూడ్సు రైలు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థతి దాపురించిందని వారంటున్నారు. అదే మార్గంలో వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ రైళ్లను వదిలితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున తాము ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యంతో నిలిచిన రెండు రైళ్లు
Published Thu, Mar 10 2016 6:18 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM
Advertisement