కనీస వేతనాల పెంపుతోపాటు ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొడ జిల్లా భువనగిరిలో గ్రామపంచాయితీ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు.
భువనగిరి: జీవో నంబర్ 11 ప్రకారం పారిశుధ్య కార్మికులకు కనీసం వేతనాన్ని రూ. 15 వేలకు పెంచి, ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొడ జిల్లా భువనగిరిలో గ్రామపంచాయితీ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు.
బుధవారం భువనగిరిలోని పాతబస్ స్టాండ్ ఎదుట కార్మికులు ఆందోళన నిర్వహించారు. అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే తమకు కూడా ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించి, ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.