
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమి నుంచి తనకు టికెట్ వచ్చినా, రాకపోయినా భువనగిరిలో తాను పోటీ చేయడం ఖాయమని యువతెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 11 నుంచి ఇంటింటికి యువతెలంగాణ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళతానని ఆయన చెప్పారు. కేసీఆర్ చెప్పిన మాటలకు, ఆయన చేస్తున్న చేతలకు పొంతనలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు మేల్కొకపోతే మరోసారి ఒక రజాకార్‌ను సీఎం చేసినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు.
భువనగిరి అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఆయన టీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. దివంగత నేత మాధవరెడ్డి కాలంలో జరిగిన అభివృద్ధిని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితిలో ఆయన ఉమా మాధవరెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అభివృద్ధి చేస్తే ఓట్ల కోసం గ్రామాల్లో డబ్బులు ఎందుకు డబ్బులు పంచుతున్నారని ప్రశ్నించారు.