jitta Balakrishna Reddy
-
తెలంగాణ మలిదశ ఉద్యమనేత జిట్టా కన్నుమూత
సాక్షి, యాదాద్రి: తెలంగాణ మలిదశ ఉద్యమనేత, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు భువనగిరికి చెందిన జిట్టా బాలకృష్ణారెడ్డి (53) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన సుమారు రెండు నెలలుగా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శరీరంలోని అన్ని అవయవాలు పాడైపోవడంతో శుక్రవారం ఉదయం జిట్టా ఆరోగ్యం పూర్తిగా విషమించింది. డాక్టర్ల సూచనల మేరకు కుటుంబ సభ్యులు వెంటిలేటర్ మీద ఆయన్ను స్వగ్రామమైన భువనగిరి సమీపంలోని ఫాంహౌస్‌కు తరలించారు. ఫాంహౌస్‌కు చేరుకున్న అనంతరం ఆయన తుదిశ్వాస విడిచారు. బాలకృష్ణారెడ్డిని ఆస్పత్రి నుంచి తరలించే సమయంలో ఆయన కుటుంబ సభ్యులతోపాటు తెలంగాణ ఉద్యమనేత డాక్టర్ చెరుకు సుధాకర్ తదితరులు ఉన్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు తన ఫాంహౌస్‌లోనే తుదిశ్వాస విడవాలన్న జిట్టా కోరిక మేరకు వెంటిలేటర్‌పై ఉన్న ఆయన్ను బొమ్మాయిపల్లికి త రలించారు. మార్గమధ్యలో భువనగిరి పట్టణంలో ఆయన నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు భారీ ర్యాలీతో తీసుకొచ్చి అభిమానులు నివాళులర్పించారు. ఫాంహౌస్‌కు చేరుకున్న తర్వాత జిట్టాకు వెంటిలేటర్ తొలగించడంతో తుదిశ్వాస విడిచారు. అధికార లాంఛనాల కోసం ప్రయత్నంప్రభుత్వ అధికార లాంఛనాలతో జిట్టా అంత్యక్రియలు నిర్వహించాలని అభిమానులు పట్టుబట్టారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిలు సీఎం కార్యాలయ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అధికారిక లాంఛనాల కోసం ఇచ్చే ఆరుగురు ఆర్మ్డ్ఫోర్స్లో కనీసం ఇద్దరినైనా ఇవ్వాలని విన్నవించినా అమలు కాలేదు. 4.30 గంటలకు ప్రారంభించాల్సిన జిట్టా అంతిమ యాత్ర గంట ఆలస్యంగా 5.30 గంటలకు ప్రారంభమైంది. టీచర్స్‌కాలనీ మీదుగా బొమ్మాయిపల్లిలోని ఆయన సొంత వ్యవసాయ భూమిలో జిట్టా అంత్యక్రియలు నిర్వహించారు. వేలాదిగా వచ్చిన అభిమానులు తుది వీడ్కోలు పలికారు. పలువురి నివాళి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతోపాటు అన్ని పార్టీల నేతలు, నాయకులు, కార్యకర్తలు, జిట్టా అభిమానులు, కళాకారు లు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, తదితరులు నివాళులర్పించారు. జిట్టా కుటుంబ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి ఓదార్చారు. ⇒ జిట్టా బాలకృష్టారెడ్డి మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ తదితరులు సంతాపం ప్రకటించారు. ⇒ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో జిట్టా బాలకృష్ణారెడ్డి క్రియాశీలకంగా పాల్గొన్నారంటూ ఆయన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ ఉన్నారు. -
TG: జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత
సాక్షి,యాదాద్రిభువనగిరిజిల్లా: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి(52) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జిట్టా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.శుక్రవారం( సెప్టెంబర్6) ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ పార్టీ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షునిగా చురుగ్గా పనిచేశారు. 2009లో భువనగిరి అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం యువతెలంగాణ పార్టీని స్థాపించి తర్వాత దానిని బీజేపీలో విలీనం చేశారు. అనంతర పరిణామాల్లో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తిరిగి సొంతగూడు బీఆర్ఎస్కు చేరారు. ఒక దశలో జిట్టాకు ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ సీటు ఇస్తారన్న ప్రచారం జరిగింది. జిట్టా మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
బీఆర్ఎస్లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, 14 ఏళ్ల వనవాసం వీడి మళ్లీ గులాబీ గూటికి బాలకృష్ణారెడ్డి రావటం ఆనందంగా ఉందన్నారు. ఇవాళ కొన్ని గద్దలు, తోడేళ్లు ఒక్కటై తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నాయని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘‘ఆనాడు రాష్ట్రం వద్దన్న వాళ్లు ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపిస్తున్నారు. మొన్న రేవంత్ రెడ్డి అమరుల స్థూపం వద్దకు వచ్చి పైసలు పంచను ప్రమాణం చేయాలని కేసీఆర్‌ను రమ్మని చెప్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఆనాడు తెలంగాణ బలి దేవత సోనియా గాంధీ అని అనలేదా?. పైసల కట్టెలతో దొరికిన దొంగ రేవంత్. తెలంగాణ అస్తిత్వంపై మరోసారి దాడి జరుగుతుంది’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్ లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడిది?. రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి ఆ పదవులు ఎక్కడివి?. తొమ్మిదిన్నరేళ్లలో సంక్షేమం ఒక వైపు అభివృద్ది మరోవైపు. అజ్ఞానులు, అహంకారంతో మాట్లాడుతున్నారు. మేము ఎవరికి బీ టీమ్ కాదు. పార్లమెంట్లో కన్నుకొట్టి, కౌగిలించుకొని ఇక్కడేమో మనల్ని అంటున్నారు. సోనియా గాంధీని బలి దేవత అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు ముద్దపప్పు నిప్పు అయ్యింది, బలి దేవత కాళి దేవత అయ్యిందా?’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. చదవండి: ప్రసంగాల్లో సామెతలు.. ఉపన్యాసాల్లో నుడి‘కారాలు’! -
కిషన్‌రెడ్డిపై జిట్టా సంచలన వ్యాఖ్యలు.. ‘కేసీఆర్ ఆదేశాలతోనే సస్పెండ్ చేశారు’
నాంపల్లి (హైదరాబాద్): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు, సస్పెన్షన్‌కు గురైన బీజేపీ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. కాగా, శనివారం ఆయన గన్‌పార్కు ఎదుట విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఎన్నికల తర్వాత పార్టీ గప్‌చుప్ కావడానికి కారణమేమిటి? పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన బండి సంజయ్‌ను ఎందుకు తొలగించారు? ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ ఏమైందని ప్రశ్నిస్తే తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. పార్టీని బలహీనపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, విజయశాంతి తదితర నేతలపై ఏం చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తానెక్కడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తాను ఇతర పార్టీల నేతలతో కిషన్‌రెడ్డి మాదిరిగా లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే కిషన్‌రెడ్డి తనను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే కవిత కేసును నిర్వీర్యం చేశారని, ఈ ఒప్పందంలో భాగంగానే కిషన్‌రెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి వచ్చిందని జిట్టా వ్యాఖ్యానించారు. హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎందుకు ఎత్తివేయటం లేదని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ: కవిత కీలక వ్యాఖ్యలు -
కొంపముంచిన స్కిట్ బండి సంజయ్ కు షాక్..!!
-
జిట్టా బాలకృష్ణారెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని గురువారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూన్ 2వ తేదీన నిర్వహించిన ‘అమరుల యాదిలో.. ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’లో కేసీఆర్‌ను కించపరిచేలా ‘స్కిట్’ చేశారని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కాగా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తనను అరెస్టు చేయడమేంటని జిట్టా పోలీసులను ప్రశ్నించారు. అయితే ఆయన మాటలను పట్టించుకోని పోలీసులు బలవంతంగా ఆయనను అరెస్టు చేశారు. అయితే జిట్టాను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లిందీ తెలియరాలేదు. అర్ధరాత్రి ఎలాంటి నోటీసు లేకుండా పోలీసులు తమ పార్టీ నేతను అరెస్టు చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దోపిడీ దొంగలమాదిరిగా తమ పార్టీ నేతను కిడ్నాప్ చేశారని ఆయన మండిపడ్డారు. వెంటనే జిట్టా ఆచూకీ తెలపాలని, ఆయనను విడుదల చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. జిట్టాకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. -
భువనగిరిలో జిట్టా వెళ్లేది ఆ పార్టీలోకేనా..?
-
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి
హయత్‌నగర్: తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తూ వారి ఆకాంక్షలను నెరవేర్చాలని యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా పెద్దంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని జె కన్వెన్షన్ హాలులో జరిగిన పార్టీ 2వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అమరవీరులకు తగిన గుర్తింపు ఇవ్వాలని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కవులు, కళాకారుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించాలని కోరారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన కంపెనీల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, రాష్ట్రంలో మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసి మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టాలని కోరారు. ఈమేరకు సమావేశంలో 15 తీర్మానాలు చేసి ఆమోదించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాణి రుద్రమరెడ్డి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో జరిగే ఎన్నికల్లో యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమరెడ్డి బరిలో దిగనున్నారు. ఈమేరకు సమావేశంలో తీర్మానం చేసి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.కాజన్‌గౌడ్, సోమగు శంకర్, ఎన్.రవికుమార్, తుమ్మ రమేష్, జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ(భువనగిరి) జె.వెంకటనారాయణ (ఖమ్మం) తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీతో యువ తెలంగాణ పార్టీ పొత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పొత్తు కుదిరింది. ఇప్పటికే మహాకూటమి పొత్తుల చర్చ జరుగుతుండగా, తాజాగా బీజేపీతో కొత్తగా ఏర్పడిన యువ తెలంగాణ పార్టీ పొత్తు కుదుర్చుకుంది. ఈ మేరకు రెండు పార్టీల ముఖ్య నేతలు గురువారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. అనంతరం వారు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. జాతీయ భావాలు కలిగిన బీజేపీనే రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. యువ తెలంగాణ పార్టీ 8 నుంచి 10 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీజేపీ ముఖ్య నేతలకు వారి అభిప్రాయా న్ని తెలియజేసినట్లు సమాచారం. అయితే 8 స్థానా లు కాకపోయినా కొన్ని స్థానాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నుంచి స్పష్టమైన హామీ లభించడంతో యువ తెలంగాణ పార్టీ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. భువనగిరి, నర్సంపేట, జనగామ స్థానాలను యువ తెలంగాణ పార్టీకి కేటాయించేందుకు బీజేపీ ముఖ్యనేతలు ఓకే చెప్పినట్లు తెలిసింది. భువనగిరి నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి, నర్సంపేట నుంచి రాణి రుద్రమ, జనగామ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి యువ తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేస్తారని సమాచారం. అందుకు బీజేపీ అంగీకరించడంతోనే సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ తరఫున జనగామ నుంచి పోటీచేసి ఓడిపోయిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆ తరువాత బీజేపీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో యువ తెలంగాణ పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్న ఆయనకు బీజేపీ ముఖ్య నేతలనుంచి హామీ లభించినట్లు తెలిసింది. దీంతో యువ తెలంగాణ పార్టీకి కేటాయించే స్థానాల్లో 3 స్థానాలపై స్పష్టత వచ్చింది. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ పొత్తులు, స్థానాలపై చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మరోవైపు బీజేపీ తరపున భువనగిరిలో పోటీ చేయాలని భావిస్తున్న పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ ఇప్పటికే అలక వహించారు. సమావేశంలో మాజీ కేంద్రమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ తదితరులు పాల్గొన్నారు. -
మహా కూటమికి మహా ఓటమి తప్పదు
హైదరాబాద్: బీజేపీతో కలిసి పనిచేసేందుకు యువ తెలంగాణ పార్టీ నడుంకట్టింది. ఈమేరకు ఆ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమదేవీలు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌తో కలిసి చర్చలు జరిపారు. సమావేశం అనంతరం బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ.. యువ తెలంగాణ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమ దేవీలు బీజేపీతో కలిసి పని చేస్తామని తెలిపినందుకు హృదయపూర్వక స్వాగతం చెబుతున్నామని తెలిపారు. వీలైతే కలిసి పోటీ చేస్తామని, అనేక సంఘాలు, చిన్న పార్టీలు కూడా సంప్రదిస్తున్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమికి, ఈ ఎన్నికల్లో మహా ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. తెలంగాణ భవిష్యత్తును మార్చే పార్టీ బీజేపీయేనని వ్యాఖ్యానించారు. అవినీతి, కుటుంబ రాజకీయాలు లేని పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీనేనని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తుతో అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోలేక విష కూటములు వస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరు, విధానం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో కలిసి పోటీ చేద్దామని కేసీఆర్‌తో చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తు చేశారు..ఇప్పుడు కాకపోయినా ఎన్నికల తర్వాత రెండూ కలిసే పార్టీలేనని విమర్శించారు. చంద్రబాబు ఫోటోతో కాంగ్రెస్ ప్రచారం.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఫోటో పెట్టి కాంగ్రెస్ ఓట్లడుగుతోంది..ఇదీ కాంగ్రెస్ దుస్థితి అని లక్ష్మణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన పెత్తనం చెలాయించడం కోసమే కూటమిలో చేరారని విమర్శించారు. కేటీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2019 తర్వాత కేసీఆర్ ఉనికిని వెతకాల్సి వస్తుందని జోస్యం చెప్పారు. మోదీ, అమిత్ షా సభల తర్వాత రాజకీయం మారుతుందని అన్నారు. సీట్ల ప్రకటన తర్వాత కాంగ్రెస్ విచ్చిన్నం కాబోతుందని వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ.. యువ తెలంగాణ పార్టీ, బీజేపీ పొత్తు నూతన పరిణామమని అన్నారు. అవమానాలు భరించి సీట్ల కోసమే కోదండరాం, సీపీఐ అందులో ఉన్నారు..ఇది పచ్చి అవకాశవాద కూటమి అని విమర్శించారు. టీఆర్ఎస్ ఓటమి అంచున ఉన్న పార్టీ అని, ఇంకా అనేక మంది నాయకులు మాతో మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు బీజేపీ ఎదుగుదల ఇష్టం లేదని అందుకే తమపై అవసరంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణాలో టీడీపీ ఈ ఎన్నికలతో పూర్తిగా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. టీడీపీ, కోదండరాం కలయికతోనే బీజేపీ వైపు ప్రజలు ఉన్నారనే సంకేతం వస్తోందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ టీఆర్ఎస్, టీడీపీ, మజ్లిస్ పార్టీలు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. రెండు కూటములు కూడా తెలంగాణ వ్యతిరేక పార్టీలతోనే నిండి ఉన్నాయని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమసమయంలో యువ తెలంగాణ పార్టీ కీలక పాత్ర పోషిందని గుర్తు చేశారు. జాతీయ భావంతో, దేశ అభివృద్ధిని చూసి, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కూటమి పేరుతో తెలంగాణాని విచ్చిన్నం చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్ర నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు చేశారు. యువ తెలంగాణ నాయకురాలు రాణి రుద్రమ మాట్లాడుతూ.. బీజేపీ, యువత మహిళలకు ప్రాధన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. తన బిడ్డ కవిత ఐడెంటిటీ పోవద్దనే కారణంతోనే కేసీఆర్ తెలంగాణాలో మహిళలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. -
టికెట్ ఇవ్వకపోయినా భువనగిరి నుంచి పోటీ చేస్తా!
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమి నుంచి తనకు టికెట్ వచ్చినా, రాకపోయినా భువనగిరిలో తాను పోటీ చేయడం ఖాయమని యువతెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 11 నుంచి ఇంటింటికి యువతెలంగాణ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళతానని ఆయన చెప్పారు. కేసీఆర్ చెప్పిన మాటలకు, ఆయన చేస్తున్న చేతలకు పొంతనలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు మేల్కొకపోతే మరోసారి ఒక రజాకార్ను సీఎం చేసినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. భువనగిరి అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఆయన టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. దివంగత నేత మాధవరెడ్డి కాలంలో జరిగిన అభివృద్ధిని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితిలో ఆయన ఉమా మాధవరెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభివృద్ధి చేస్తే ఓట్ల కోసం గ్రామాల్లో డబ్బులు ఎందుకు డబ్బులు పంచుతున్నారని ప్రశ్నించారు. -
జిట్టాతో కోదండరాం భేటీ
హక్కుల కోసం పోరాటంలో కలసి రావాలని ఆహ్వానం సాక్షి, హైదరాబాద్: యువ తెలంగాణ జేఏసీ వ్యవ స్థాపకుడు, టీఆర్ఎస్ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డితో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం గురువారం భేటీ అయ్యారు. వీరి సమావేశంలో పలువురు జేఏసీ నేతలు పాల్గొన్నారు. రైతులు, యువకుల హక్కులకోసం జరుగుతున్న పోరాటంలో తెలంగాణ ఉద్యమనేతలంతా కలసిరావాలని కోదండరాం, జిట్టాను ఆహ్వానించారు. జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ప్రజల పక్షాన తెలంగాణ హక్కులకోసం పోరాడాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. ఆయా సంఘాల నేతలతో మాట్లాడి, నిర్ణయం తీసుకోవడానికి ఒకటిరెండు రోజులు సమయం ఇవ్వాలని జిట్టా కోరారు.