హక్కుల కోసం పోరాటంలో కలసి రావాలని ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: యువ తెలంగాణ జేఏసీ వ్యవ స్థాపకుడు, టీఆర్‌ఎస్ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డితో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం గురువారం భేటీ అయ్యారు. వీరి సమావేశంలో పలువురు జేఏసీ నేతలు పాల్గొన్నారు. రైతులు, యువకుల హక్కులకోసం జరుగుతున్న పోరాటంలో తెలంగాణ ఉద్యమనేతలంతా కలసిరావాలని కోదండరాం, జిట్టాను ఆహ్వానించారు. జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ప్రజల పక్షాన తెలంగాణ హక్కులకోసం పోరాడాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. ఆయా సంఘాల నేతలతో మాట్లాడి, నిర్ణయం తీసుకోవడానికి ఒకటిరెండు రోజులు సమయం ఇవ్వాలని జిట్టా కోరారు.
జిట్టాతో కోదండరాం భేటీ
Published Fri, Feb 10 2017 2:44 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement
Advertisement