సాక్షి,యాదాద్రిభువనగిరిజిల్లా: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి(52) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జిట్టా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.శుక్రవారం( సెప్టెంబర్6) ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ ఉద్యమంలో జిట్టా కీలక పాత్ర పోషించారు. బీఆర్‌ఎస్ పార్టీ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షునిగా చురుగ్గా పనిచేశారు. 2009లో భువనగిరి అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అనంతరం యువతెలంగాణ పార్టీని స్థాపించి తర్వాత దానిని బీజేపీలో విలీనం చేశారు. అనంతర పరిణామాల్లో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తిరిగి సొంతగూడు బీఆర్‌ఎస్‌కు చేరారు.
ఒక దశలో జిట్టాకు ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి భువనగిరి ఎంపీ సీటు ఇస్తారన్న ప్రచారం జరిగింది. జిట్టా మృతి పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment