పట్టణానికి చెందిన న్యాయవాది ఎంఏ రహీం ఆచూకీ చెప్పాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు డీఎస్పీ సాదు మోహన్‌రెడ్డిని కోరారు.
భువనగిరి బార్ అసోసియేషన్
భువనగిరి: పట్టణానికి చెందిన న్యాయవాది ఎంఏ రహీం ఆచూకీ చెప్పాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు డీఎస్పీ సాదు మోహన్‌రెడ్డిని కోరారు. మంగళవారం ఉదయం బార్ అసోసియేషన్ కార్యవర్గం, ప్రతినిధులు, న్యాయవాదులు కలిసి డీఎస్పీని పట్టణ పోలీస్ స్టేషన్‌లో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రోజులుగా రహీం కన్పించడం లేదని దీంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారన్నారు. రహీం ఎక్కడ ఉన్నా వెంటనే బహిర్గతం చేయాలని కోరారు. అయితే తమ అదుపులో రహీం లేడని డీఎస్పీ చెప్పారు. అతని ఆచూకీ తెలిస్తే వెంటనే చెబుతామని ఆయన న్యాయవాదులకుహామీ ఇచ్చారు.