రామకృష్ణ హత్య కేసులో మరో ఏడుగురి రిమాండ్‌  | Seven People accused Remanded In Ramakrishna Murder Case | Sakshi
Sakshi News home page

రామకృష్ణ హత్య కేసులో మరో ఏడుగురి రిమాండ్‌ 

Published Wed, Apr 20 2022 2:34 AM | Last Updated on Wed, Apr 20 2022 2:34 AM

Seven People accused Remanded In Ramakrishna Murder Case - Sakshi

నిందితులను నల్లగొండ జైలుకు తరలిస్తున్న పోలీసులు 

భువనగిరి క్రైం: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, మాజీ హోంగార్డు రామకృష్ణ హత్యకేసులో మిగిలిన ఏడుగురు నిందితులను మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ కేసులో ప్రమేయంఉందని భావిస్తున్న మొత్తం 11మందిలో సోమవారం నలుగురిని రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల అదుపులో ఉన్న మిగతా ఏడుగురు ఏ1 పల్లెపాటి వెంకటేశం, ఏ2 దోర్నాల యాదగిరి(బీబీనగర్‌ పీఎస్‌లో హోంగార్డు), ఏ3 దంతూరి రాములు, ఏ8 మహ్మద్‌ సిద్దిఖీ, ఏ9 తోట్ల ధనలక్ష్మి, ఏ10 తోట్ల నరేందర్, ఏ11 తోట్ల భానుప్రకాశ్‌లను విచారించారు. భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం నల్లగొండ జైలుకు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement