నల్లగొండ జిల్లా రామన్నపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలంటూ ఆందోళనలు జరుగుతున్నాయి.
నల్లగొండ జిల్లా రామన్నపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. సోమవారం విపక్షాల నేతృత్వంలో మండల కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీగా తరలివెళ్లి తహశీల్దార్ ప్రమోదినికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం చిట్యాల -భువనగిరిరహదారిపై 200 మంది బైఠాయించారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని నినాదాలు చేశారు.