భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరి మండలం రాయిగిరిలో బుధవారం జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమం రసాభాసగా మారింది. సర్పంచ్, వార్డు మెంబర్ ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కార్యక్రమం నుంచి వెళ్లిన వెంటనే గ్రామంలోని సమస్యలపై సర్పంచ్ బి.విమల, ఎనిమిదో వార్డు సభ్యుడు యాదగిరి మధ్య వాదన జరిగింది. కోపంతో ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో అక్కడున్న టీఆర్‌ఎస్ నాయకులు వారిని సముదాయించారు.