నిర్మాణ కార్మికుల నమోదుకు ప్రత్యేక డ్రైవ్
రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు గుర్తింపునిచ్చేందుకు వారి పేర్లు నమోదు చేస్తామని, ఇందుకు ఫిబ్రవరిలో స్పెషల్ డ్రైవ్‌చేపట్టనున్నామని హోం, కార్మిక శాఖల మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. భవన నిర్మాణ కార్మికు ల సంక్షేమంపై ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 9.49 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుగా నమోదై ఉన్నారని చెప్పారు. ఇప్పటికే భవన నిర్మాణ సంక్షేమ మండలి ద్వారా 69 వేల మందికి పైగా కార్మికులకు రూ.82.55 కోట్లను ఖర్చు చేశామని తెలిపారు. మరో 10 కోట్ల వ్యయంతో 35,375 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు.