
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి
మఠంపల్లి : మైండ్ పవర్‌లో ప్రపంచ రికార్డ్ సాధించిన తాటికొండ వేణుగోపాల్‌రెడ్డి రచించిన ఒత్తిడిని జయించడం (కాంక్యూర్‌స్ట్రెస్) పుస్తకాన్ని మంగళవారం హైదరాబాద్‌లో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఒత్తిడి ప్రమాదకరమైన వైరస్ అని ఈ పుస్తకం ఆ వైరస్‌ను విద్యార్థులకు సోకకుండా చేస్తుందన్నారు. పుస్తకాన్ని రచించిన మరో రచయిత విజయార్కె మాట్లాడుతూ ప్రాక్టికల్ థింకింగ్, మన ఆలోచన విధానం ఎలా ఉండాలో, ఒత్తిడిని ఎలా జయించాలో ఈ పుస్తకం తెలియజేస్తుందన్నారు.
అంతేగాక పుస్తకాన్ని ఆవిష్కరించిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదవదగ్గ పుస్తకమని, తల్లిదండ్రులకు మార్గదర్శకంగా ఉంటుందని అభినందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో శివారెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసాచారి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment