
మత్తుమందుల కేసుల్లో ఇప్పటి వరకు 22 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఈఅంశంపై సభ్యులు రేవంత్‌రెడ్డి, వెంకటవీరయ్య, కృష్ణయ్య, జె.గీత, టి.జీవన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిలపూర్వక సమాధానమిచ్చారు.
మత్తు మందుల కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, మత్తుమందుల లభ్యతను, వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభు త్వం అనేక చర్యలు తీసుకుందని నాయినిపేర్కొన్నారు.