సాక్షి, హైదరాబాద్ : తీవ్ర అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. బుధవారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న నాయినిని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాయిని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. సీఎం వెంట రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.
(చదవండి : నాయిని ఆరోగ్యం విషమం )
కాగా, గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని ఇటీవల కోలుకొని మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఆక్సిజన్ పడిపోవడంతో ఈ నెల 13న తిరిగి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment