గోదావరిఖని: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం లేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నా రు. ఎవరైనా మావోయిస్టులు తారసపడితే వారిని అరెస్టు చేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నదని, ఎన్‌కౌంటర్ల కు దూరంగా ఉందని స్పష్టం చేశారు. గురువారం గోదావరిఖనిలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.3 కోట్ల వ్యయంతో పోలీస్ గెస్ట్‌హౌస్, కమ్యూనిటీ సెంటర్ నిర్మాణ పనులను ఆయన భూమిపూజ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వస్తే మావోయిస్టులు పెరుగుతారని, ఆంధ్రోళ్లను తరిమి కొడతారని, వారి ఇళ్లను లూటీ చేస్తారని విషప్రచారం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇక మహిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయబోమని హోంమంత్రి తెలిపారు. తెలంగాణ వస్తే అనేక ఇబ్బందులు ఏర్పడతాయన్న ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కిదర్ గయా అని హోంశాఖ మంత్రి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment