హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా నాయిని నర్సింహారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన గురువారం సచివాలయంలోని డి బ్లాక్‌లో బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా నాయినికి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ శాంతి భద్రతలు, మత సామరస్యానికే తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేస్తామని ఆయన పేర్కొన్నారు. పోలీసులకు తప్పనిసరిగా వారాంతపు సెలవు ఉండేలా చూస్తామన్నారు.
తెలంగాణ పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తామన్నారు. హైదరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేస్తామని అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా కేసుల సత్వర పరిష్కారానికి సీఐడీని బలోపేతం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో మావోయిస్టులు లేరని, అదంతా మీడియా సృష్టేనన్నారు. అతినీతి లేని పోలీస్ శాఖను చూపిస్తానని నాయిని అన్నారు. ప్రతి మహిళ ధైర్యంగా పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసే వాతావరణాన్ని కల్పిస్తామని ఆయన తెలిపారు.
తెలంగాణలో మావోయిస్టులు లేరు: నాయిని
Published Thu, Jun 5 2014 8:51 AM | Last Updated on Sat, Oct 20 2018 5:05 PM
Advertisement