telangana home minister
-
'ఆధునిక హంగులతో నాంపల్లి కొత్త పీఎస్'
హైదరాబాద్: నాంపల్లిలో అన్ని ఆధునిక హంగులతో పోలీస్‌స్టేషన్ నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి తెలిపారు. శనివారం ఉదయం పోలీస్‌స్టేషన్ కొత్త భవనానికి నాయిని నర్సింహారెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతోపాటు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, ఇతర పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
'నయీం కేసులో దోషులెవరినీ వదలం'
కరీంనగర్: గ్యాంగ్‌స్టర్ నయీం దురాగతాలపై సిట్ విచారణ కొనసాగుతోందని రాష్ట్ర హోం, కార్మిక శాఖల మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. అతనికి అనుకూలంగా ఎవరూ వ్యవహరించినట్లు తేలినా వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... నయీమ్ బాధితులకు భూములు ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా పని చేస్తుందన్నారు. చట్టానికి విరుద్ధంగా ఎవరూ పని చేసినా క్షమించబోమని చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల ఎస్సైలు ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని... అలాగే వారి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని నాయిని వివరించారు. ఇప్పటికే జిల్లాల స్థాయిలో ఎస్సైలకు ఎస్పీలు కౌన్సెలింగ్ నిర్వహించారని నాయిని చెప్పారు. -
'కేసీఆర్‌కి ప్రజల దీవెనలున్నాయి'
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రజలు దీవెనలున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. అందుకు ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం అని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో 67వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నాయిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాడు తెల్లదొరలను తరిమి స్వాతంత్రం సాధించుకున్నామని... నేడు అన్యాయాన్ని ఎదిరించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని నాయిని స్పష్టం చేశారు. -
కార్మికుల డిమాండ్లపై సీఎంతో చర్చించి నిర్ణయం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింప చేసే దిశగా తమ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. అందులోభాగంగా జీహెచ్ఎంసీ కార్మికులతో నేడు మరోసారి మంత్రుల బృందం చర్చలు జరుపుతుందని తెలిపారు. కార్మికుల డిమాండ్లపై సీఎం కేసీఆర్‌తో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. జీతాలు పెంచాలని జీహెచ్ఎంసీ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారానికి రెండో రోజు చేరిన సంగతి తెలిసిందే. -
ఆదిలాబాద్ జిల్లా పోలీస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన హోంమంత్రి
మంచిర్యాల (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాకు సంబంధించిన పోలీస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అనంతరం సీసీసీ(కోల్ కెమికల్ కాంప్లెక్స్)లో పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జిల్లాకు చెందిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
'హామీల అమలులో తెలంగాణ ప్రభుత్వం ముందుంది'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం హామీ అమలులో ముందుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం నాయిని మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్ ద్వారానే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఏ ఎన్నికలొచ్చినా మేమే విజయం సాధిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెప్తారని నాయిని నరసింహరెడ్డి పేర్కొన్నారు. -
లిఫ్ట్‌లో చిక్కుకున్న హోంమంత్రి, డిప్యూటీ సీఎం
-
తెలంగాణలో మావోయిస్టులు లేరు: నాయిని
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా నాయిని నర్సింహారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన గురువారం సచివాలయంలోని డి బ్లాక్‌లో బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా నాయినికి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ శాంతి భద్రతలు, మత సామరస్యానికే తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేస్తామని ఆయన పేర్కొన్నారు. పోలీసులకు తప్పనిసరిగా వారాంతపు సెలవు ఉండేలా చూస్తామన్నారు. తెలంగాణ పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తామన్నారు. హైదరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేస్తామని అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా కేసుల సత్వర పరిష్కారానికి సీఐడీని బలోపేతం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో మావోయిస్టులు లేరని, అదంతా మీడియా సృష్టేనన్నారు. అతినీతి లేని పోలీస్ శాఖను చూపిస్తానని నాయిని అన్నారు. ప్రతి మహిళ ధైర్యంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసే వాతావరణాన్ని కల్పిస్తామని ఆయన తెలిపారు.