పోలీసు సంక్షేమానికి చర్యలు
హోంమంత్రి నాయిని
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర పోలీసుల సంక్షేమా నికి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం పోలీసు అధికారుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, ఎక్స్‌గ్రేషి యాను గణనీయంగా పెంచామని, పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇళ్లు, విద్య, లాస్డ్‌పెన్షన్ తదితర సదుపా యాలు కల్పిస్తున్నామని వివరిం చారు. మొట్టమొదటి సారిగా హోం గార్డులకు ఎక్స్‌గ్రేషియాను వర్తింప జేస్తున్నామన్నారు. ట్రాఫిక్‌తో పాటు సీఐడీ, ఇంటెలిజెన్స్ తదితర విభాగాలకు ప్రత్యేక అలవెన్సులు చెల్లిస్తున్నామన్నారు.
ఇతర రాష్ట్రాలకన్నా పటిష్టం: సీఎస్
దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ పోలీసు శాఖ చాలా పటిష్టంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఈ సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. సాంకే తిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నేర నియం త్రణలో ఉపయోగిస్తున్న తీరు దేశ పోలీస్ మొత్తాన్నీ హైదరాబాద్ ఆకర్షిస్తోందన్నారు. అదే విధంగా పోలీస్‌స్టేషన్ల ఆధునికీకరణ, ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని పెంచిందన్నారు.
దేశ భద్రతలోనూ కీలక పాత్ర: డీజీపీ
రాష్ట్ర పోలీసు విభాగం శాంతి భద్రతల విషయంలోనే కాకుండా దేశ భద్రత విషయంలోనూ కీలకంగా పనిచేస్తోందని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ చేస్తున్న కృషిని దేశం మొత్తం గర్విస్తోందన్నారు. అదే విధంగా టెక్నాలజీ ఉపయోగంలోనూ అన్ని రాష్ట్రాల కన్నా ముందువరుసలో ఉన్నామని అన్నారు. ప్రతీ దర్యాప్తు అధికారి, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తన టేబుల్‌పై కంప్యూటర్‌లోనే కేసుల పురోగతి తెలుసుకునే సదుపాయాన్ని కల్పించామని అనురాగ్ శర్మ తెలిపారు. అలాగే షీటీమ్స్ పనితీరును కూడా దేశం మొత్తం గుర్తించిందన్నారు. మన రాష్ట్రంలో మంచి ఫలితాలు చూసిన ఇతర రాష్ట్రాలు కూడా షీటీమ్స్‌ను ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు. ఇలా ప్రతీ అంశంలో తెలంగాణ పోలీస్ ది బెస్ట్ అనిపించేలా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు కారణమైన సిబ్బంది, అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.