మధుకర్‌ మృతిపై హోంమంత్రి స్పందించాలి | Mallu Ravi demand Naini Narsinha Reddy responce on Madhukar's death | Sakshi
Sakshi News home page

మధుకర్‌ మృతిపై హోంమంత్రి స్పందించాలి

Published Tue, Apr 4 2017 3:31 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

మధుకర్‌ మృతిపై హోంమంత్రి స్పందించాలి - Sakshi

మధుకర్‌ మృతిపై హోంమంత్రి స్పందించాలి

టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి

సాక్షి, హైదరాబాద్‌: మంథనిలో దళిత యువకుడు మధుకర్‌ అనుమానాస్పద మృతిపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించి, సమగ్ర విచారణ జరిపించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్‌ చేశారు. మధుకర్‌ మృతిపై బాధిత కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారికి న్యాయం చేయాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు.

మధుకర్‌ మృతి విషయంలో రాజకీయ నాయకులపై అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయన్నారు.  దోషులకు శిక్ష పడే విధంగా సమగ్ర విచారణ జరిపించాలని రవి డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement