విదేశాలల్లో ఉద్యోగాలు చేయగోరేవారు టామ్‌కామ్‌ను మాత్రమే సంప్రదించాలి.
- వరంగల్ మెగా ఉద్యోగ మేళాలో మంత్రి నాయిని
వరంగల్: విదేశాలల్లో ఉద్యోగాలు చేయగోరేవారు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) ను మాత్రమే సంప్రదించాలని, ప్రైవేట్ ఏజెన్సీల చేతిలోపడి మోసపోవద్దని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి బుధవారం వరంగల్‌లో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ఆయన.. ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదనే విమర్శలు అర్థరహితమన్నారు.
హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని నాయిని అన్నారు. ములుగు రోడ్డులోని ఐటీఐ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.