సిడ్నీ : ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతు ఉస్మానియా యూనివర్సిటీ దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్శిటీ అని, ఎంతో మంది విద్యార్థులను మేధావులుగా, మహానేతలుగా తీర్చిదిద్దిన ఘనచరిత్ర కలదని, ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాలకు పురిటిగడ్డ అని కొనియాడారు. చరిత్రలో నిలిచిన ఒక విద్యా సంస్థకు వందేండ్లు రావడం, శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చన్నారు. టీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం సభ్యులు, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వి. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతు తాను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చేసి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నానని అన్నారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలలో పాలుపంచుకోవడం గర్వంగా ఉందన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నా తెలుగు ఆడపడుచులు అందరు తెలంగాణలో తయారు చేసిన పోచంపల్లి చీరలు ధరిస్తే తెలంగాణలో వున్న పోచంపల్లి కార్మికులకు ఎంతో ఉపోయోగపడుతారని అన్నారు.
అనంతరం ఆస్ట్రేలియా ఎంపి జోడీ మెకాయ్‌కు తెలంగాణ గుర్తుగా ప్రత్యేక పోచంపల్లి చీరను బహుకరించారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఎంపిలు జోడి మెకాయ్, జియోఫ్రేలీ, టీఆర్‌ఎస్ నగర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆజాం అలీ, సీనియర్ నాయకులు సంతోష్ గుప్తా, ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల కమిటీ చైర్మన్ వినోద్ ఎలెట, ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు అశోక్ మాలిష్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సేరి, వివిధ ఆస్ట్రేలియా సంస్థల ప్రతినిధులు, తెలంగాణ ఎన్నారైలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆస్ట్రేలియాలో ఘనంగా ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు
Published Sun, Dec 3 2017 6:58 PM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment