బాలలతో పనులు చేయిస్తే ఖబడ్దార్‌ | Naini narsimha reddy comments Child labor System | Sakshi
Sakshi News home page

బాలలతో పనులు చేయిస్తే ఖబడ్దార్‌

Published Thu, Dec 22 2016 3:39 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

బాలలతో పనులు చేయిస్తే ఖబడ్దార్‌ - Sakshi

బాలలతో పనులు చేయిస్తే ఖబడ్దార్‌

హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి 
 

సాక్షి, హైదరాబాద్‌: ‘బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం యుద్ధం మొదలైంది. కార్మిక శాఖతోపాటు అన్ని శాఖలూ ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఇకపై బాలలతో పనులు చేయిస్తే ఊరుకునేది లేదు. సమాచారం ఇస్తే చాలు దాడులు చేసి జైలుకు పంపుతాం’ అని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.

బుధవారం ఇక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సదస్సులో మంత్రి మాట్లాడారు. చిన్నపిల్లల్ని పనుల్లో పెట్టుకోవడంతో పాటు వారిని హింసిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఆకస్మిక దాడులు నిర్వహించి యజమానులపై కేసులు నమోదు చేసి బాలలకు విముక్తి కలిగిస్తున్నామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement