Labor Department
-
Canada Labour Shortage: కెనడాలో 10 లక్షల ఉద్యోగ ఖాళీలు
అట్టావా: కెనడాలో ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతున్నాయని ఆ దేశ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది. 2022 మేతో పోలిస్తే మరో 3 లక్షల ఖాళీలు పెరిగి మొత్తం 10 లక్షలను దాటేశాయి. చాలా పరిశ్రమల్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. కెనడాలో ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారిలో చాలా మంది రిటైర్మెంట్ వయస్సుకు దగ్గర పడటంతో విదేశీ కార్మికులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది కెనడాలో అత్యధికంగా 4.3 లక్షల మందికి పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఈ లక్ష్యం 2024 నాటికి 4.5 లక్షలకు చేరవచ్చని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉండటం వలసదారులకు సానుకూలంగా మారింది. వృత్తి నిపుణులు, సైంటిఫిక్– టెక్నికల్ సేవలు అందించేవారు, రవాణా, వేర్ హౌసింగ్, ఫైనాన్స్, బీమా, వినోదం, రియల్ ఎస్టేట్ రంగాల్లో అత్యధిక ఖాళీలు ఉన్నాయి. వీటితోపాటు నిర్మాణ రంగంలో సుమారు 90 వేల ఉద్యోగావకాశాలున్నాయి. విద్యారంగంలో 9,700 ఖాళీలు ఏర్పడ్డాయి. ఆహార సేవల రంగంలో ఖాళీలు ఫిబ్రవరి నుంచి 10% మేర పెరిగాయి. రానున్న పదేళ్లలో సుమారు 90 లక్షల మంది రిటైర్మెంట్కు దగ్గర కానున్నారు. వాస్తవానికి కెనడాలో చాలా చిన్న వయస్సులోనే రిటైర్మెంట్లు తీసుకుంటారు. ప్రతి 10 రిటైర్మెంట్లలో మూడు ముందుగానే తీసుకునేవే ఉంటాయి. -
AP: కార్మిక మంత్రిగా గుమ్మనూరు జయరాం బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఏపీ కార్మిక మంత్రిగా గుమ్మనూరు జయరాం బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. బీసీలంతా ఎప్పటికీ సీఎం జగన్‌కి అండగా ఉంటారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు సీఎం అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. రాష్ట్రంలో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తున్నారని, ఇందుకోసం ప్రత్యేక బిల్లు తెచ్చారని గుర్తు చేశారు. కార్మికులకు ఈఎస్ఐ ద్వారా వైద్యం అందించడంతో పాటు ఈ-ఔషధ ద్వారా పాదర్శక విధానం తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య యజ్ఞం రాజకీయ నేపథ్యం: 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆలూరులో పాటీచేసి ఓటమి పాలయ్యారు. 2012లో వైఎస్సార్సీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో ఆలూరు నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. -
‘ఆర్టీసీ’ ఎన్నికల పోరు నేడు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఆర్టీసీ యూనియన్ల గుర్తింపు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 5 గంటల నుంచే ఎన్నికలు నిర్వహించేందుకు కార్మికశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జోరుగా సాగిన ప్రచారంతో ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. రాష్ట్ర నాయకులు డిపోల స్థాయిలో ప్రచారం, బహిరంగ సభలు నిర్వహించి భారీగా హామీలను ఇచ్చారు. ఆర్టీసీలో ఐదు యూనియన్లకు కార్మిక శాఖ గుర్తింపు ఉంది. ఎన్నికల్లో తమ ప్యానల్‌ను గెలిపించేందుకు ఏ యూనియన్ సొంతగా ప్రయత్నాలు చేయలేదు. రాజకీయ పార్టీల అండతో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేశారు. కాగడా గుర్తుపై నేషనల్ మజ్దూర్ యూనియన్, బస్సు గుర్తుపై ఎంప్లాయీస్ యూనియన్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. రీజియన్ స్థాయిలో ఎన్నికల కమిటీ ప్రధాన అధికారిగా డిప్యూటీ కమిషనర్ బి.ఏసుదాసును కార్మిక శాఖ నియమించింది. ఎన్నికల సహాయ అ«ధికారిగా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వెంకటనారాయణ వ్యవహరిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 12 పోలింగ్ బూత్‌లు జిల్లాలోని పది డిపోల్లో ఒక్కొక్కటి చొప్పున, నెల్లూరు ఆర్ఎం ఆఫీసులో, పడుగుపాడు వర్క్‌షాపులో ఒకటి వంతున మొత్తం 12 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. నెల్లూరు ఆర్ఎం ఆఫీసులో 48 ఓట్లు, ఈడీ ఆఫీసులో (వెంకటాచలం ట్రైనింగ్ ఆఫీసు) 52 ఓట్లు, నెల్లూరు డిపో–1లో 638 ఓట్లు, నెల్లూరు డిపో–2లో 532, సూళ్లూరుపేటలో 318, గూడూరు 337, వాకాడు 279 , రాపూరు 311, వెంకటగిరి 319, ఆత్మకూరు 339, ఉదయగిరి 287, కావలి 400, పడుగుపాడు వర్క్‌షాపులో 134, మొత్తం 3,994 మంది ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం ఆర్టీసీ గుర్తింపు యూనియన్ల పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశాం. పోలింగ్ అయిన అర్ధగంట తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రాత్రికల్లా ఫలితాలు వెలువడుతాయి. – బి.ఏసుదాసు, ఎన్నికల ప్రధాన అధికారి -
బాలలతో పనులు చేయిస్తే ఖబడ్దార్
హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం యుద్ధం మొదలైంది. కార్మిక శాఖతోపాటు అన్ని శాఖలూ ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఇకపై బాలలతో పనులు చేయిస్తే ఊరుకునేది లేదు. సమాచారం ఇస్తే చాలు దాడులు చేసి జైలుకు పంపుతాం’ అని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఇక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సదస్సులో మంత్రి మాట్లాడారు. చిన్నపిల్లల్ని పనుల్లో పెట్టుకోవడంతో పాటు వారిని హింసిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఆకస్మిక దాడులు నిర్వహించి యజమానులపై కేసులు నమోదు చేసి బాలలకు విముక్తి కలిగిస్తున్నామని చెప్పారు.