అట్టావా: కెనడాలో ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతున్నాయని ఆ దేశ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది. 2022 మేతో పోలిస్తే మరో 3 లక్షల ఖాళీలు పెరిగి మొత్తం 10 లక్షలను దాటేశాయి. చాలా పరిశ్రమల్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. కెనడాలో ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారిలో చాలా మంది రిటైర్మెంట్ వయస్సుకు దగ్గర పడటంతో విదేశీ కార్మికులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది కెనడాలో అత్యధికంగా 4.3 లక్షల మందికి పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఈ లక్ష్యం 2024 నాటికి 4.5 లక్షలకు చేరవచ్చని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉండటం వలసదారులకు సానుకూలంగా మారింది.
వృత్తి నిపుణులు, సైంటిఫిక్– టెక్నికల్ సేవలు అందించేవారు, రవాణా, వేర్ హౌసింగ్, ఫైనాన్స్, బీమా, వినోదం, రియల్ ఎస్టేట్ రంగాల్లో అత్యధిక ఖాళీలు ఉన్నాయి. వీటితోపాటు నిర్మాణ రంగంలో సుమారు 90 వేల ఉద్యోగావకాశాలున్నాయి. విద్యారంగంలో 9,700 ఖాళీలు ఏర్పడ్డాయి. ఆహార సేవల రంగంలో ఖాళీలు ఫిబ్రవరి నుంచి 10% మేర పెరిగాయి. రానున్న పదేళ్లలో సుమారు 90 లక్షల మంది రిటైర్మెంట్‌కు దగ్గర కానున్నారు. వాస్తవానికి కెనడాలో చాలా చిన్న వయస్సులోనే రిటైర్మెంట్లు తీసుకుంటారు. ప్రతి 10 రిటైర్మెంట్లలో మూడు ముందుగానే తీసుకునేవే ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment