రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చీటికి మాటికి విమర్శలు చేస్తున్న టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఎజెండా ఏమిటో అర్థం కావడం లేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక శక్తులతో ఆయన చేతులు కలిపారు: హోంమంత్రి నాయిని
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చీటికి మాటికి విమర్శలు చేస్తున్న టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఎజెండా ఏమిటో అర్థం కావడం లేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కోదండరాంకు ఏం కావాలో ఆయనకే అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠం వార్షికోత్స వాలకు హాజరైన నాయిని అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులతో కోదండరాం చేతులు కలిపారని విమర్శిం చారు. కోటి ఎకరాలకు సాగునీరిచ్చేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే ఆ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని, ఆ పార్టీ నేతలతో కోదండరాం కుమ్మక్కయ్యారని ఆరోపిం చారు. పత్రికల్లో వచ్చే ఫొటోల ఆధారంగా చర్యలు తీసుకోలేం... అలాగైతే ప్రభుత్వాన్ని నడపలేం అని నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు.