ప్రాజెక్టుల రద్దుపై రగడ | Fight on cancellation of Projects | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల రద్దుపై రగడ

Published Sun, Mar 19 2017 3:48 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Fight on cancellation of Projects

మండలిలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం

ఇందిరా, రాజీవ్‌ సాగర్‌ ప్రాజెక్టులను ఎందుకు రద్దు చేశారు: కాంగ్రెస్‌
రాష్ట్ర ప్రయోజనానికి భంగం వాటిల్లే ప్రాజెక్టులనే రద్దు చేశామన్న హరీశ్‌


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి శనివారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా అధికార, విపక్షాల మధ్య రగడ చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రాజెక్టులనే రద్దు చేశామని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు.. కాంగ్రెస్‌ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీంతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజన కరమైన ఇందిరా, రాజీవ్‌ సాగర్‌ ప్రాజెక్టులను ఎందుకు రద్దు చేశారని కాంగ్రెస్‌ సభ్యులు నిలదీశారు. ప్రాజెక్టులకు దేశం కోసం ప్రాణాల ర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల పేర్లను కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పెడితే, రీడిజైన్‌ పేరిట ప్రస్తుత ప్రభుత్వం ఆ పేర్లను తొలగించడాన్ని తీవ్రంగా నిరసించారు.

ప్రభుత్వ తీరుకు నిరసన తెలిపే అవకాశ మివ్వాలని కోరినప్పటికీ చైర్మన్‌ అంగీకరించక పోవడంతో సభ నుంచి వాకౌట్‌ చేశారు. అంతకుముందు హరీశ్‌రావు మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా నదుల నుంచి 225 టీఎంసీల నీటిని రాయలసీమకు తీసుకెళ్లేందుకు అప్పటి ప్రభుత్వం దుమ్ముగూడెం టేల్‌ పాండ్‌ ప్రాజె క్టును ప్రారంభించిదని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే ఆ ప్రాజెక్టును రద్దు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, అధ్యయనం చేసిన తర్వాతే ఇందిరా, రాజీవ్‌ సాగర్‌ లను రీడిజైన్‌ చేయాలని నిర్ణయించామని వివరించారు. రాజీవ్‌ సాగర్‌ ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వైల్డ్‌లైఫ్‌ అనుమతిని తీసుకురాలేకపోయిందని, ఇందిరా సాగర్‌ ప్రాజెక్టు వల్ల అంతర్రాష్ట్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున.. వాటిని ప్రీ క్లోజర్‌ చేసి భక్త రామదాసు, సీతారామ ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు.

పాలు కల్తీ చేసేవారిపై పీడీ యాక్ట్‌  
హైదరాబాద్‌లో పాలను కల్తీ చేసే వారిపై ఆహార భద్రతా చట్టం మేరకు కేసులు నమోదు చేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమా ధానంగా చెప్పారు. రాజేశ్వర్‌రెడ్డి మాట్లా డుతూ.. కల్తీదారులపై పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలో వచ్చే రెండు నెలల్లోగా కిడ్నీ రోగుల కోసం 34 కొత్త డయాలసిస్‌ యూనిట్లను పీపీపీ పద్ధతిన ఏర్పాటు చేస్తు న్నట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్‌గౌడ్‌ తదితరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

సివిల్‌ వివాదాల్లో తలదూర్చిన పోలీసులపై చర్యలు: నాయిని
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సివిల్‌ వివాదాల్లో తలదూర్చిన ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేశామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీలు షబ్బీర్‌అలీ, పొంగు లేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఉన్నతాధి కారులకు, ప్రభుత్వ పెద్దలకు ఉన్నతాధి కారులపై అవినీతి ఆరోపణలు చేసి ఆత్మహత్య చేసుకున్న ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి కేసు దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కార్మిక సంక్షేమ మండలిలో నమోదైన భవన నిర్మాణ కార్మికుడు అకస్మాత్తుగా మరణిస్తే రూ.6 లక్షలు, పూర్తి వైకల్యం పొందితే రూ.5 లక్షలు చెల్లిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement