తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి(ఫైల్)
సాక్షి, జగిత్యాల : మరో 15 ఏళ్ల వరకు టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉండటం గ్యారెంటీ అని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నాడు సీఎం ఏం చెప్పారో అదే జరుగుతోందని అన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రభుత్వం నడుస్తోందని, కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీరు అందిస్తామని, కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. టీఆర్‌ఎస్ పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని పేర్కొన్నారు.
ఉత్తమ్‌కుమార్ రెడ్డి గడ్డం తీసేది లేదని, బుడ్డార ఖాన్(రేవంత్‌రెడ్డి)కి కేటీఆర్ అంత వయస్సు లేదు.. ఆయనా సీఎంను తిట్టేది అంటూ ఛలోక్తులు విసిరారు. అమిత్‌షా ఢిల్లీకే పరిమితమయ్యారని, ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి పనికి వచ్చే పని ఒక్కటైనా చేశారా అని ప్రశ్నించారు. మోదీకి కేవలం నోరు ఉందని, నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో 33శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. తమకు ఎవరితోనూ తగాదాలు లేవని, తెలంగాణ ప్రజలు శాంతి కాముకులని పేర్కొన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment