హైదరాబాద్: ఖైరతాబాద్ లో కొలువుదీరిన 63 అడుగుల మహా గణేశుడికి తొలిపూజ జరిగింది. పూజా కార్యక్రంమలో తెలంగాణ గవర్నర్ తమిళి సై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని, దానం నాగేందర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
ఖైరతాబాద్ లో గణేశుడు ఈసారి శ్రీ దశ విద్యా మహాగణపతిగా దర్శనమివ్వనున్నాడు. ఈరోజు మహాగణపతి నిర్వహించిన తొలిపూజలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సహా పలువురు ప్రముఖులు హాజరుకాగా భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు.
ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు గాని సమస్యలు గాని తలెత్తకుండా అన్ని విభాగాలను సమన్వయము చేశామన్నారు. ప్రభుత్వం తరపున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. నిమజ్జనం వరకు కూడా ఈ ఏర్పాట్లు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
గవర్నర్ తమిళి సై మహా గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు అంతా సుఖశాంతులతో, ఆరోగ్యాంగా ఉండాలని ఖైరతాబాద్ గణేషుడిని కోరుతున్నానన్నారు.
ఇది కూడా చదవండి: Traffic Diversions:నేడు మహాగణపతికి గవర్నర్ తమిళిసై పూజలు..
Comments
Please login to add a commentAdd a comment