సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీ స్ కమిషన్ చైర్మన్ (టీఎస్‌పీఎస్సీ)గా రాష్ట్ర మా జీ డీజీపీ మహేందర్‌రెడ్డి నియమితులయ్యా రు. అదేవిధంగా కమిషన్‌లో పది మంది సభ్యు ల నియామకానికి అవకాశం ఉండగా.. ప్రభు త్వం చేసిన ప్రతిపాదనల మేరకు ఐదుగురిని సభ్యులుగా నియమించడానికి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ని యమితులైన చైర్మన్, సభ్యుల పదవీ కాలం ఆరే ళ్ల పాటు ఉంటుంది. అయితే 62 ఏళ్లు పైబడిన వారు పదవీ విరమణ పొందాల్సి ఉంటుంది.
దరఖాస్తులు స్వీకరించి.. సెర్చ్ కమిటీ వేసి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన దిశగా చర్యలు వేగవంతం చేసింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, తదనంతర పరిణామాల నేపథ్యంలో గతంలో కమిషన్ చైర్మన్‌గా వ్యవ హరించిన బి.జనార్ధన్‌రెడ్డి డిసెంబర్‌లో రాజీ నామా చేశారు. ఆ తర్వాత ఐదుగురు సభ్యులు కూడా రాజీనామా చేయడంతో కొత్తగా చైర్మన్, సభ్యుల నియామకం అనివార్యమైంది.
ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాల్లో పీఎస్సీల పనితీరును అధ్యయనం చేయాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాను స్వయంగా యూపీఎస్సీ చైర్మన్‌తో సమావేశమై టీఎస్‌పీఎస్సీ నిర్వహణకు సలహాలు సూచనలు కోరారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల ఎంపిక ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరించింది.
వాటి పరిశీలనకు సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. దరఖాస్తుల వడపోత అనంతరం సెర్చ్ కమిటీ చైర్మన్, సభ్యుల కోసం కొన్ని పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు సమాచారం. కాగా ఈ మేరకు రాష్ట్ర సర్కారు చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.
36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం
టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 1962 డిసెంబర్ 3న ఆయన జన్మించారు. దాదాపు 36 సంవత్సరాల పాటు సర్వీసులో కొనసాగిన మహేందర్‌రెడ్డి 2022 డిసెంబర్ నెలాఖరులో పదవీ విరమణ చేశారు.
టీఎస్‌పీఎస్సీ టీమ్ ఇదే
చైర్మన్: ఎం.మహేందర్‌రెడ్డి(రిటైర్డ్ ఐపీఎస్)
సభ్యులు: అనితా రాజేంద్ర (రిటైర్డ్ ఐఏఎస్), అమిర్ ఉల్లా ఖాన్, (రిటైర్డ్ ఇండియన్ పోస్టల్ సర్వీస్), ప్రొఫెసర్ నర్రి యాదయ్య, యరబడి రామ్మోహన్‌రావు, పాల్వాయి రజినీకుమారి
టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల బయోడేటాలు
పేరు: ఎం.మహేందర్ రెడ్డి
స్వస్థలం : ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం కిష్టాపురం గ్రామం
పుట్టిన తేదీ : 1962 డిసెంబర్ 3
సామాజికవర్గం: రెడ్డి (ఓసీ)
విద్యార్హతలు: ఆర్‌ఈసీ వరంగల్ నుంచి బీటెక్ (సివిల్), ఐఐటీ ఢిల్లీ నుంచి ఎంటెక్
హోదా: రిటైర్డ్ డీజీపీ (2022 డిసెంబర్) (1986 బ్యాచ్ ఐపీఎస్)
పేరు: అనితా రాజేంద్ర
స్వస్థలం : రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పూర్
పుట్టిన తేదీ : 1963 ఫిబ్రవరి 04, బీసీ–బీ (గౌడ)
విద్యార్హతలు: బీకాం, ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం
హోదా: రిటైర్డ్ ఐఏఎస్
పేరు: అమిర్ ఉల్లా ఖాన్ స్వస్థలం : హైదరాబాద్
సామాజికవర్గం : ముస్లిం వయస్సు: 58 ఏళ్లు
అనుభవం: యూఎన్‌డీపీలో పనిచేస్తున్నారు. ఉర్దూ వర్సిటీ, నల్సార్, ఐఎస్‌బీ, ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో విజిటింగ్ ప్రొఫెసర్.
హోదా: ఇండియన్ పోస్టల్ ఉద్యోగానికి రాజీనామా
పేరు: పాల్వాయి రజనీకుమారి
స్వస్థలం : సూర్యాపేట
పుట్టిన తేదీ: 06–05–1972, ఎస్సీ మాదిగ
విద్యార్హతలు: ఎంఏ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీ
హోదా: టీచర్, వీడీఓ, మున్సిపల్ కమిషనర్
పేరు: వై.రామ్మోహన్‌రావు
స్వస్థలం : హైదరాబాద్
పుట్టిన తేదీ : 1963 ఏప్రిల్ 4
సామాజికవర్గం : ఎస్టీ–ఎరుకల
విద్యార్హతలు: బీఈ, ఎంబీఏ
హోదా: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తెలంగాణ జెన్‌కో
పేరు: డాక్టర్ నర్రి యాదయ్య
స్వస్థలం: మల్లారెడ్డిగూడెం, యాద్రాది భువనగిరి జిల్లా
పుట్టిన తేదీ : 1964–4–10
సామాజికవర్గం: బీసీ–బీ(కురుమ)
విద్యార్హతలు: ఎంటెక్ , పీహెచ్‌డీ
హోదా: సీనియర్ ప్రొఫెసర్, జేఎన్‌టీయూహెచ్, కూకట్‌పల్లి
Comments
Please login to add a commentAdd a comment