గవర్నర్‌ తమిళిసై దీపావళి శుభాకాంక్షలు  | Telangana Governor extends Diwali greetings to people | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ తమిళిసై దీపావళి శుభాకాంక్షలు 

Published Sun, Nov 12 2023 1:00 AM | Last Updated on Sun, Nov 12 2023 9:04 AM

Telangana Governor extends Diwali greetings to people - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు.

ఆధునిక సమాజంలోని చెడులపై విజయం సాధించి, శాంతి, మతసామరస్యం, సోదరభావంతో కూడిన సమాజనిర్మాణానికి ఈ పండుగ స్ఫూర్తిని కలిగిస్తుందని అన్నారు.ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ఫూర్తితో పండుగ సందర్భంగా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి ఇక్కడి ఉత్పత్తిదారులకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖసంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement