Happy Diwali
-
నరకాసురులతో అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: ‘మనం పయనించే ప్రగతిపథంలో అడుగడుగునా అడ్డుపడే నరకాసురులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు సూచించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళికి హిందూసంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యముందన్నారు. జీవానికి సంకేతమైన అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి నూతనోత్తేజంతో ముందడుగు వేసేలా ప్రేరణనిస్తాయని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని కోరి ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటాకులు కాలుస్తూ దీపావళి పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలనీ, ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. రేవంత్ దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగను రాష్ట్ర ప్రజలు సుఖశాంతు లతో ఘనంగా జరుపుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేర కు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయంగా దీపావ ళి పండుగను జరుపుకుంటామని, రాబోయే ఎన్నికలలో తెలంగాణకు పట్టిన చీకటి పోయి వెలుగులు రావడం ఖాయమని పేర్కొన్నారు. -
గవర్నర్ తమిళిసై దీపావళి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. ఆధునిక సమాజంలోని చెడులపై విజయం సాధించి, శాంతి, మతసామరస్యం, సోదరభావంతో కూడిన సమాజనిర్మాణానికి ఈ పండుగ స్ఫూర్తిని కలిగిస్తుందని అన్నారు.ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో పండుగ సందర్భంగా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి ఇక్కడి ఉత్పత్తిదారులకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖసంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. -
ఆ దీపావళి రోజులు
దీపావళి పిల్లల పండుగ. కాకరపువ్వొత్తులు కలర్ పెన్సిళ్లు, చిచ్చుబుడ్లు పాము బిళ్లలు, తుపాకీ రీళ్లు... ఇప్పటి సంగతి ఏమోకాని కొన్ని తరాల బాల్యం దీపావళితో గడిచింది. ఒక్క బొమ్మ తుపాకీ కోసం అలకలు.. హర్తాళ్లు.. దొంగ– పోలీస్ ఆటలు.. ఆ రోజులే వేరు. ఒక వారం ముందు నుంచే వీధిలో ఠపా, ఠుపీ సౌండ్లు మొదలవుతాయి. ఆ వీధి చివరి ఇంట్లో పిల్లాడు శెట్టిగారి అంగట్లో దొరికే పది పైసల తుపాకీ బిళ్లలు కొని, ఆ బిళ్లల డబ్బీ జాగ్రత్తగా దాచుకుని, అందులో ఒకో బిళ్లను గచ్చు నేల మీద పెట్టి, గుండ్రాయితో ఠాప్మని పేల్చుతుంటాడు. డబ్బీ అయిపోతే మళ్లీ ఇంకో డబ్బీకి అమ్మ పదిపైసలు గ్యారంటీగా ఇస్తుంది. ఆ పది పైసలూ లేనివాడు ఎలాగో చేసి చిన్న ఇనుపగుంట, గూటం సంపాదిస్తాడు. ఎక్కడ దొరుకుతుందో దొరుకుతుంది గంధకం పొడి. ఆ పొడి సీసాను దగ్గర పెట్టుకుని, కొంచెం గంధకం పొడి ఇనుప గుంటలో పెట్టి, గూటం బిగించి, ఆ గూటానికి ఉండే పాలజాటీని పట్టుకుని గట్టిగా గోడకు కొడితే ఠాప్ అని సౌండ్ వస్తుంది. ఇక గంధకం పొడి అయిపోయేంత కాలం వాడి దీపావళికి దిగుల్లేదు. పోయిన దీపావళికి కొన్న గన్ను కనిపించదు. లేదా పాడై ఉంటుంది. కొత్త గన్ కొన్న పిలకాయలు వాటిని పట్టుకుని దొంగ పోలీస్ ఆట ఆడుతుంటారు. మనకూ కావాలనిపిస్తుంది. బజారుకు వెళ్లి టపాకాయల అంగడిలో అడిగితే రూపాయిన్నరది ఒకటి, మూడు రూపాయలది, ఐదు రూపాయలది చూపిస్తాడు. నల్లటి రంగు వేసిన రేకు తుపాకీలు, స్టీలు తుపాకీలు... కొనాలంటే డబ్బులెక్కడివి. వచ్చిన అమ్మను అడిగితే వీపు మీద ఒక టపాకాయల పేలుతుంది. నాన్నను అడిగితే ‘కొందాం లేరా.. దీపావళి చాలా రోజులు ఉందిగా’ అంటాడు. ఈలోపు అన్నయ్య వాళ్లను వీళ్లను అడిగి, బంధువుల దగ్గర చిల్లర సంపాదించి ఒకటి సొంతానికి కొనుక్కుంటాడు. వాడు వాడిది మనకు చచ్చినా ఇవ్వడు. ఇంకేంటి? అలక... నిరాహార దీక్ష... హర్తాళ్.. రాస్తారోకో... చివరకు నిరసన దీక్షకు ఇంట్లో ఉన్న నానమ్మ ముక్కు చీది ‘పిల్లాడు ఏమడిగాడని’ అని ఏడుపు. ఆఖరకు తుపాకీ శాంక్షన్ అవుతుంది. ఇంకేంటి. నానమ్మ తన ముక్కుపొడుం డబ్బులు త్యాగం చేసి రీల్స్ ప్యాకెట్ కొనిస్తుంది. ఒక ప్యాకెట్లో పది రీల్స్ డబ్బీలు ఉంటాయి. ఒక్కో డబ్బీలో ఒక్కో రీలు. తుపాకీ విప్పి రీలు చుట్టి మళ్లీ కచ్చితంగా బిగించడం ఒక ఆర్టు. ఆ పని చేశాక ట్రిగర్ నొక్కిన ప్రతిసారీ రీల్ రన్ అవుతూ ఠాప్ ఠాప్ సౌండ్ వస్తుంటే సూపర్‌స్టార్ కృష్ణ కూడా నిలువలేడు ఆ స్టయిల్‌కి. డబ్బులు పెద్దగా ఉండని రోజులు అవి. పిల్లలు తమ కోర్కెలను కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టే రోజులు. ఒక తండ్రి ఒక కొడుక్కి నేల టపాకాయల సంచి కొనిస్తాడు. పది రూపాయలకు చాలా నేల టపాకాయలు ఉంటాయి దానిలో చిన్నవి. ఆ పిల్లవాడికి బుద్ధి పుట్టినప్పుడల్లా ఒక నేల టపాకాయ తీసి నేలన గట్టిగా బాదితే ఢమ్మని సౌండు. మరో బీద తండ్రి తన కొడుక్కి తాటాకు టపాకాయలు కొనిస్తాడు. తాటాకులో మందు కూర్చి వొత్తి బయటకు వచ్చేలా ఉండే ఆ చీప్ టపాకాయలు సౌండ్‌లో మేటి. క్యాండిల్ వెలిగించి ఒక్కో తాటాకు టపాకాయ అంటించి విసురుతూ ఉంటే ఠపాఠపా అంటాయి. పీర్ ప్రెజర్ ఉండేది ఆ రోజుల్లో. మీ నాన్న ఎంతకు కొని తెచ్చాడు అనంటే మీ నాన్న ఎంతకు కొని తెచ్చాడు అని. పిల్లలు తమ దగ్గర ఉన్న అన్ని డబ్బాల కాకర పువ్వొత్తులను లెక్క వేసి పక్క కుర్రాడితో పోల్చుకునేవారు. చిచ్చుబుడ్లు ఫ్యాషన్‌వి కొనేవాళ్లు డబ్బున్నవాళ్లు. మట్టి చిచ్చుబుడ్లు కొనేవాళ్లు మధ్యతరగతి వారు. ఆ మట్టి చిచ్చుబుడ్లు మూడ్ బాగుంటే బుజ్‌మని వెలిగేవి. లేకుంటే తుస్‌మనేవి. విష్ణుచక్రం, భూచక్రం అందరూ కొనలేరు. లక్ష్మీ ఔట్లు క్వాలిటీ ఔట్లు. ఆరు ఔట్లు ఒక ప్యాకెట్. కొంటే చెవులు చిల్లులు పడేలా పేలడం గ్యారంటీ. పురికొస బాంబులు కూడా మానం గల్లవి. తుస్‌మనడం వాటి చరిత్రలో లేవు. ఇక పిల్లిపిసర సరం ప్రమాద రహితమైనది. 500 వాలా, 1000 వాలా కొనేది శ్రీమంతులు. వాళ్లు అందరూ టపాకాయలు కాల్చేక ఏ అర్ధరాత్రో 1000 వాలా వెలిగించి పది నిమిషాలు ఢమఢమలాడించి తమ దర్జా చూపించుకుంటారు. పిల్లలు దీపావళికి కొత్తబట్టలు అడగరు. కాని టపాకాయలు మాత్రం తప్పక అడుగుతారు. పాముబిళ్లలు, వెన్నముద్దలు, మెగ్నీషియం రిబ్బన్లు, కలర్ అగ్గిపెట్టెలు... ఇవి ఉంటే పెన్నిధి ఉన్నట్టే. ఇంతా చేసి దీపావళి ముందు రోజు నుంచి ముసురు పట్టుకుంటే వాళ్లు బెంగ పడతారు. చీటికి మాటికి ఆకాశం వైపు చూస్తుంటారు. అయ్యో.. వీటిని కాల్చడం ఎలా అనుకుంటారు. దీపావళి రోజు వాన రావడం ఆనవాయితీ. పిల్లలతో ఆడుకోవడానికే వచ్చి కాసేపు అల్లరి చేసి వెళ్లేది అది. దీపావళికి చుట్టుపక్కల పిల్లలను గమనించుకోవడం పెద్దలు తప్పక చేసేవారు. కొన్ని టపాకాయల్ని కొనుక్కోలేని పిల్లలకు ఇచ్చేవారు. తమ పిల్లల చేత ఇప్పించేవారు. తమ ఇంటి ముంగిట్లో టపాకాయలు కాలుస్తున్నప్పుడు పక్కింటి పిల్లలు తెల్లముఖం వేసుకు చూస్తుంటే పిలిచి వారి చేత కూడా కాల్పించేవారు. ప్రేమ, స్నేహం ఉన్నది కాస్త పంచితే పెరుగుతుంది. దీపం అంటే తాను వెలిగేది మాత్రమే కాదు.. వెలుతురు పంచేది. ఒక దీపం నుంచి వేయి దీపాలు వెలుగుతాయి. ఈ దీపావళిని ప్రేమను పెంచుతూ జరుపుకోండి. చిన్నప్పటి రోజులను పిల్లలకు చెప్పండి. పిల్లలకు సురక్షితమైన దీపావళి సరంజామా ఇచ్చి దగ్గరుండి వారి చేత కాల్పించండి. హ్యాపీ దీపావళి. -
ఆశల దీపాలు వెలిగిద్దాం
వెలుతురు కావాలి జీవితాల్లో. చీకటిని దూరంగా నెట్టేయాలి. చేదు జ్ఞాపకాలని చెరిపేయాలి. వేదనను తరిమికొట్టాలి. కోవిడ్ కాలంలో ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా పరోక్షంగా సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఎందరో ఆప్తులు రోజుల తరబడి ఆస్పత్రుల్లో ఉండి దక్కుతారా లేదా అని ప్రాణాలు ఉగ్గబట్టేలా చేశారు. కోవిడ్ బారిన పడి విజేతలైన వారందరికీ ఇది ఆనందమయ దీపావళి. అందుకే దీనిని అద్భుతమైన జ్ఞాపకంగా మలుచుకోవాలి. సంబరాల వెన్నముద్దల్ని వెలిగించాలి. హ్యాపీ దీపావళి. ఆ రోజులు ఇక వద్దనే వద్దు. అలాంటి రోజులు ఇక మీదట ఎవరికీ వద్దు. అలా అనుకుని సంకల్పం చేసుకుని ప్రతి ముంగిలిలో ఒక దీపం వెలిగించాలి ఈ పండక్కు. ఆ భయం ఇక ఎవరికీ రాకూడదు. టెస్ట్‌ల కోసం బారులు తీరిన ఎదురు చూపులు ఎదురు పడకూడదు. ల్యాబ్‌లకు పరిగెత్తి పోవడాలు.. సిటి స్కాన్లను అదురుతున్న గుండెలతో పరిశీలించడాలు... ఆస్పత్రి బిల్లులకై హైరానాలు... దొరకని మందుల కోసం కార్చిన కన్నీళ్లు... పునరావృత్తం కాకూడదని ఆశిస్తూ ఆకాశచువ్వలను ఎగరేయాలి ఈ దీపావళికి. క్రిమి తెచ్చిన చీకటిని దేశమంతా దీపాలతో నింపి ఓడించాలి. అవును. గోరంత దీపమే కొండంత వెలుగు. చిగురంత ఆశ జగమంత వెలుగు. మళ్లీ మళ్లీ చూడాలి దీపావళి కోవిడ్‌ని ఎదిరించి విజేతలైన వారు ఇవాళ కోట్లలో ఉన్నారు. అలా విజేతలు కావడానికి కోవిడ్‌ని ఓడించడానికి వారు పెద్ద యుద్ధమే చేశారు. కొందరు అతి సులువుగా గెలిచారు. మరికొందరు చాలా కష్టపడి విజయహాసం చేయగలిగారు. కోవిడ్ నుంచి బయటపడినా ఎన్నో చికాకుల్లో ఉన్నవారు నేడు ఉన్నారు. చోటా మోటా ఆరోగ్య సమస్యలు వారిని వేధిస్తున్నాయి. ఈ దీపావళి నాడు అలాంటి మన కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు తప్పనిసరిగా ఉత్సాహభరితమైన దీపావళి శుభాకాంక్షలు చెప్పాలి. ఈ దీపావళిని చూశాం... మున్ముందు మరిన్ని దీపావళులను మనందరం చూస్తాం... ఒక దశను దాటాం... అంతిమ విజయాన్ని కూడా చూస్తాం అని ధైర్య వచనాలతో శుభాకాంక్షలు చెప్పాలి. కానుకలు ఇచ్చి వారిని ఉత్సాహ పరచాలి. కోవిడ్ సమయంలో ప్రత్యక్ష సహాయం చేయలేకపోవచ్చు. కాని ఇప్పుడు ఒకరికి ఒకరున్నాం అని చెప్పగలగాలి. వారి కోసం మిఠాయి డబ్బాలతో పాటు, కొత్త వస్త్రాలతో పాటు, కొద్ది పాటి భరోసాను ఇస్తే అది నిజమైన దీపావళి. సమూహ దీపావళి. సందర్భ దీపావళి. వేక్సిన్ దీపావళి నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి సంహరించాడు. ఆయుధాలు లేకుండా దుష్ట సంహారం జరగదు. స్త్రీ పురుషులు కలవకుండా కొన్ని చెడులు నాశనం కావు. ఇప్పుడు ప్రతి ఇంటి భార్యాభర్తలు బాధ్యతగా ఉండి వేక్సిన్ అనే ఆయుధంతో కోవిడ్‌పై కుటుంబానికి విజయాన్ని సిద్ధింప చేయాలి. నిజమైన వెలుతురు ఇంటికి రావాలంటే నిజమైన వెలుతురు కింద మనం ఉన్నామని ధైర్యం కలగాలంటే కుటుంబంలోని అందరూ వేక్సిన్ వేసుకున్నారా లేదా అని ఈ పండగ సందర్భంగా చెక్ చేసుకోవాలి. ఒక్క డోస్ కూడా వేసుకోని వారిని వెంటనే కదిల్చి తీసుకెళ్లాలి. రెండోడోస్ అక్కర్లేదనుకుని పాలుమారిన వారిని ఒక్క డోస్‌తో నరకాసురుడు సగమే చస్తాడని చెప్పి పూర్తి చేయించాలి. రెండు డోస్‌ల వేక్సిన్ వేయించుకున్నాక కలిగే సురక్ష భావనలో ఈ దీపావళి జరుపుకుంటే ఆ కళ వేరు. ఆ కాంతి వేరు. బాలల దీపావళి పిల్లలు చిచ్చుబుడ్లు. భలే వెలుగుతారు. వారు నవ్వితే వెలుతురు పూలు పూస్తాయి. అలాంటి బాలలకు ఇంకా పూర్తి రక్షణ దొరకలేదు. వేక్సిన్ కనుచూపు మేరలో ఉంది. మరోవైపు స్కూళ్ల వారు వెళ్లక తప్పని పరిస్థితి. ఈ సందర్భంలో ప్రమాదకరమైన టపాకాయలకు వారిని దూరం పెట్టినట్టుగా కోవిడ్ నుంచి దూరం పెట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ వారికి పదే పదే చెప్పాలి. వారి కోసం జాగ్రత్తలు పదే పదే పాటించాలి. నిజానికి వారు అలసిపోయి ఉన్నారు. విసిగిపోయి ఉన్నారు. దీపావళి వారి పండగ. వారికి ఈ సమయంలో ఆటవిడుపు ఇచ్చి వారితో సమయం గడపాలి. బంధువుల్లో, తెలిసినవారిలో ఎవరైనా పిల్లలు దురదృష్టవశాత్తు తల్లిదండ్రుల్లో ఎవరినో ఒకరిని కోల్పోయి ఉంటే అలాంటి పిల్లల్లో తప్పక ఆశను నింపాలి. వారికి కావల్సిన కానుకలిచ్చి సంతోష పెట్టాలి. వారి చేతుల్లో తప్పక ఒక దీపావళి టపాసు పెట్టాలి. సమాజ దీపావళి కోవిడ్ ఇంకా ముగిసిపోలేదు. ఆ పాము తోక ముడిచిందో లేదో తెలియదు. మనల్ని మనం కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడుకుంటే మన వెలుతురు సమాజ వెలుతురు కలిసి స్వస్థ కాంతి అవుతుంది. కోవిడ్ జాగ్రత్తలు మరి కొన్నాళ్లు పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించి మన ద్వారా ముప్పు పెరగకుండా ఉండాలని సంకల్పం చెప్పుకుంటూ దివ్వెను వెలిగించాలి. అంతే కాదు... ఈ సందర్భంలో రకరకాల చిక్కుల్లో ఉన్నవారికి చేతనైన సహాయం చేయడం అవసరం అని భావించాలి. చేయాలి. దీపావళి అంటే ఒక దివ్వె నుంచి ఇంకో దివ్వె వెలగడం. మనిషిగా మనం సాటి వారి కోసం కొంచెమైనా వెలుగు ఇవ్వగలిగితే అదే ఈ కాలంలో మానవీయ దీపావళి. కోవిడ్ ఇంకా ముగిసిపోలేదు. ఆ పాము తోక ముడిచిందో లేదో తెలియదు. మనల్ని మనం కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడుకుంటే మన వెలుతురు సమాజ వెలుతురు కలిసి స్వస్థ కాంతి అవుతుంది. కోవిడ్ జాగ్రత్తలు మరి కొన్నాళ్లు పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించి మన ద్వారా ముప్పు పెరగకుండా ఉండాలని సంకల్పం చెప్పుకుంటూ దివ్వెను వెలిగించాలి. -
కరోనా కారు చీకట్లో ఆశల దీపావళి
-
మోదీని కాపీ కొట్టిన ట్రంప్.. దీపావళి విషెస్ కూడా..
న్యూయార్క్: డోనాల్డ్ ట్రంప్ అనగానే పరిచయం అవసరం లేకుండానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే వ్యక్తి. ఆయన ఒక్కో మాట ఒక సంచలనం. ఆయన ఇప్పటి వరకు మెక్సికన్లను అవమానించి ఉండొచ్చు.. ముస్లింలను తిట్టిపోసి ఉండొచ్చు. కానీ, అనూహ్యంగా భారతీయ అమెరికన్లను మాత్రం ట్రంప్ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ 2014లో ప్రచార అస్త్రంగా ఉపయోగించిన వాక్యాన్ని కాపీ కొట్టి తన పేరిట ప్రచార వాక్యంగా ఉపయోగించారు. అది కూడా అచ్చం మోదీలాగే హిందీలో ఆ వాక్యాన్ని చెబుతూ అబ్బురపరిచారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న ట్రంప్ దీపావళి పండుగను పురస్కరించుకొని భారతీయ అమెరికన్లకు శుభాకాంక్షలు చెబుతూ ఒక ప్రకటన చేశారు. అందులో చక్కగా హిందీ భాషలో మాట్లాడారు. 'ఆప్ కీ బార్ ట్రంప్ సర్కార్'(ఈసారి ట్రంప్ ప్రభుత్వం) అంటూ వ్యాఖ్యానించాడు. ప్రధాని మోదీ గతంలో 2014లో 'ఆప్ కీ బార్ మోదీ సర్కార్' అంటూ ప్రచారంలో వాడిన విషయం తెలిసిందే. అంతేకాదు, న్యూజెర్సీలో ఏర్పాటుచేసిన సమావేశానికి వచ్చిన హిందు భారతీయ అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంగా ఉన్న ఫుటేజీని ఈ ప్రకటనకు జతచేసి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. భారత్-అమెరికా సంబంధాలు చాలా బలంగా ఉంటాయని తాను హామీ ఇస్తున్నట్లు అందులో తెలిపారు. 'భారతీయ హిందూ వర్గం అమెరికన్ వైట్ హౌస్ కు చాలా దగ్గరి మిత్రులు. మేం హిందువులను ప్రేమిస్తాం. మేం భారత్‌ను ప్రేమిస్తాం. మోదీతో కలిసి పనిచేసే యోచన చేస్తున్నాను' అంటూ ఆయన ఆ ప్రకటన వీడియోలో మాట్లాడారు. గతవారం ఆయన కూతురు లారా ట్రంప్ వర్జీనియాలోని హిందూ ఆలయాన్ని సందర్శించి పూజలు కూడా నిర్వహించారట. -
తియ్యని తీపావళి
ఏ వాకిట్లో వెలిగినా... చీకట్లు ఉన్నంత మేర ప్రయాణిస్తాయి దీపకాంతులు. తీపిని పంచుకున్నా అంతే! వత్తిని వత్తి వెలిగించినట్లు... చేయిని చేయి హత్తుకున్నట్లు... హృదయాలన్నీ తియ్యందనాలౌతాయి. ఇచ్చిపుచ్చుకున్నవన్నీచిచ్చుబుడ్లయి పూలు కురిపిస్తాయి. ఆఖరికి... హ్యాపీ దీపావళి అనే మాట కూడా... తియ్యని ‘తీపావళి’లా వినిపిస్తుంది. మరి మీరేం పంచబోతున్నారు? బర్ఫీనా, గులాబ్జామా? లడ్డూనా, సున్నుండలా? సెవెన్ కప్ బర్ఫీ కావలసినవి: శనగపిండి - ఒక కప్పు, పాలు - ఒక కప్పు, పచ్చికొబ్బరితురుము - ఒక కప్పు, పంచదార - ఒకటిన్నర కప్పులు, కరిగించిన నెయ్యి - ఒకటిన్నర కప్పులు, ఏలకులపొడి - టీ స్పూను, బాదంపప్పులు - గార్నిషింగ్‌కి తగినన్ని తయారి: బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి బాదంపప్పులను బంగారురంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి అదే బాణలిలో శనగపిండి వేసి సన్నని మంట మీద దోరగా వేయించాలి. (మాడకుండా చూసుకోవాలి) మందంగా ఉండే పెద్ద బాణలిలో ఈ మిశ్రమాలన్నిటినీ వేసి బాగా కలపాలి (మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేస్తే ఉండలు లేకుండా అన్ని పదార్థాలు బాగా కలుస్తాయి) స్టౌ మీద ఈ బాణలి ఉంచి ఐదు నిముషాలు పెద్ద మంట మీద ఉంచి ఆపకుండా కలుపుతుండాలి మంట తగ్గించి అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి సుమారు అరగంట తరవాత ఈ మిశ్రమం బాగా ఉడికి బాణలి నుండి విడుతుంటుంది ఒక పెద్ద ప్లేట్‌కి నెయ్యి రాసి, ఉడికిన మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరవాలి బాదంపప్పులతో గార్నిష్ చేసి, వేడిగా ఉండగానే కావలసిన ఆకారంలోముక్కలుగా కట్ చేయాలి చల్లారిన తరవాత ముక్కలను తీసి గాలి చొరని డబ్బాలో జాగ్రత్త చేసుకోవాలి ఇవి సుమారు నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి. (గమనిక: చాలామంది మైసూర్‌పాక్ సరిగా రావటంలేదని అనుకుంటారు. కాని ఈ సెవెన్ కప్ బర్ఫీ కుదరకపోవడం ఉండదు. చాలా రుచిగా వస్తుంది) పెసర సున్నుండలు కావలసినవి: పెసలు - కప్పు, బెల్లం తురుము - కప్పు, నెయ్యి - అర కప్పు, బియ్యం - కొద్దిగా, కిస్మిస్ - 10 గ్రా., జీడిపప్పు - 10 గ్రా. తయారి: స్టౌ మీద బాణలిలో పెసలు వేసి దోరగా వేయించాలి కొద్దిగా రంగుమారాక దించి పక్కన ఉంచాలి అదే బాణలిలో బియ్యం వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి బెల్లం తురుము జతచేసి మరోమారు మిక్సీ పట్టాలి ఈ పొడిని ఒక పాత్రలోకి తీసుకుని, జీడిపప్పులు, కిస్మిస్ జతచేసి, కరిగించిన నెయ్యి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టుకోవాలి గాలికి ఆరిన తర్వాత గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి ఇవి నెలరోజులకు పైగా నిల్వ ఉంటాయి. సేమ్యా... కొబ్బరి లడ్డు కావలసినవి: సేమ్యా - కప్పు, పంచదార- కప్పు, ఎండుకొబ్బరి తురుము - కప్పు, నెయ్యి - అరకప్పు, ఏలకులపొడి - టీ స్పూను, మిఠాయిరంగు - చిటికెడు తయారి: బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక, సేమ్యా వేసి వేయించి దించేయాలి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి అయ్యేలా గ్రైండ్ చేయాలి ఒక పాత్రలో పంచదార, కొద్దిగా నీరు పోసి స్టౌ మీద ఉంచి పంచదార కరిగి తీగపాకం వచ్చేవరకు ఉంచాలి సేమ్యాపొడి, కొబ్బరితురుము, ఏలకులపొడి, మిఠాయిరంగు వేసి బాగా కలపాలి నెయ్యి కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతుండాలి ఉడుకుతున్న మిశ్రమం అంచులను విడుతున్నట్టుగా అనిపించాక స్టౌ ఆర్పేయాలి కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, ఉడికిన మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని లడ్డూలు తయారు చేయాలి పూర్తిగా చల్లారాక గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి ఇవి వారం రోజులు నిల్వ ఉంటాయి. క్యారట్ గులాబ్‌జామ్ కావలసినవి: క్యారట్లు - పావు కిలో, పంచదార - పావుకిలో, మైదా - 125 గ్రా., గులాబ్‌జామ్ పొడి - 125 గ్రా., కార్న్‌ఫ్లోర్ - 6 టీ స్పూన్లు, పిస్తా - 10 (సన్నగా కట్ చేసుకోవాలి), పంచదార - అర టేబుల్ స్పూను, నీరు - ఒకటింపావు కప్పులు, ఏలకులపొడి - పావు టీ స్పూను, నెయ్యి - వేయించడానికి తగినంత తయారి: క్యారట్లను శుభ్రంగా కడిగి తొక్క తీసి తురుముకోవాలి కుకర్‌లో ఉంచి సుమారు 20 నిముషాలు ఉడికించాలి చల్లారాక అధికంగా ఉన్న నీటిని పిండి తీసేసి, క్యారట్ తురుమును మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి ఒక పాత్రలో మైదా, గులాబ్‌జామ్ పొడి వేసి బాగా కలపాలి అందులోనే క్యారట్ పేస్ట్, కార్న్‌ఫ్లోర్ జత చేసి బాగా కలపాలి చిన్నచిన్న ఉండలుగా చేసి ప్రతి బాల్‌నూ చేతితో పూరీలా ఒత్తి, అందులో కొద్దిగా పంచదార, పిస్తా ముక్కలు ఉంచి బాల్లా తయారుచేయాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఈ బాల్స్‌ని వేసి మీడియం మంట మీద వేయించి బంగారువర్ణంలోకి వచ్చాక తీసేయాలి ఒక పాత్రలో పంచదార, నీరు పోసి మరిగించి స్టౌ ఆర్పేయాలి ఏలకుల పొడి వేసి కలపాలి వేయించి ఉంచుకున్న జామూన్స్ని ఇందులో వేసి సుమారు రెండు గంటల తరవాత సర్వ్ చేయాలి. దబ్బకాయ పులిహోర కావలసినవి: బియ్యం - రెండు కప్పులు, నీరు - మూడు కప్పులు, దబ్బకాయ - 1, ఆవాలు - టీ స్పూను, శనగపప్పు - మూడు టీ స్పూన్లు, మినప్పప్పు - మూడు టీ స్పూన్లు, కరివేపాకు - మూడు రెమ్మలు, ఎండుమిర్చి - ఆరు, పచ్చిమిర్చి - నాలుగు, పల్లీలు - పావు కప్పు, జీడిపప్పు - 10 గ్రా., పసుపు - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, ఇంగువ - టీ స్పూను, నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు తయారి: బియ్యాన్ని శుభ్రంగా కడిగి మూడుకప్పుల నీరు పోసి పొడిపొడిగా వచ్చేలా అన్నం ఉడికించి దించి వేడిగా ఉండగానే పెద్ద పాత్రలోకి తిరగతీసి అటు ఇటు కలపాలి బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి బాగా వేయించాలి పచ్చిమిర్చి తరుగు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, ఇంగువ జత చేసి వేయించి దించేయాలి ఒక పాత్రలోకి దబ్బకాయ రసం తీసి, ఉప్పు జతచేసి బాగా కలపాలి పాత్రలోకి తీసుకున్న అన్నం మీద వేయించి ఉంచుకున్న పోపు, దబ్బకాయరసం వేసి బాగా కలిపి సుమారు గంట తర్వాత సర్వ్ చేయాలి. రవ్వ అప్పాలు కావలసినవి: బొంబాయిరవ్వ - కప్పు, పంచదార - కప్పు, నీరు - కప్పు, కొబ్బరి తురుము - పావు కప్పు, నెయ్యి - రెండు టీ స్పూన్లు, ఏలకుల పొడి - అర టీ స్పూను, నూనె - డీప్ ఫ్రైకి తగినంత తయారి: ముందుగా ఒక బాణలిలో బొంబాయిరవ్వ వేసి సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి ఒక పాత్రలో కప్పు నీరు పోసి మరిగించాలి వేయించి ఉంచిన బొంబాయిరవ్వను కొద్దికొద్దిగా పోస్తూ ఆపకుండా కలుపుతుండాలి పంచదార జతచేసి బాగా కలపాలి నెయ్యి, కొబ్బరితురుము, ఏలకులపొడి వేసి మరోమారు కలిపి మిశ్రమం దగ్గర పడేవరకు కలుపుతుండాలి కిందకు దించి ఐదు నిముషాలు చల్లారనివ్వాలి చేతికి కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసుకుని ఉడికించిన మిశ్రమం కొద్దిగా తీసుకుని అప్పాల మాదిరిగా ఒత్తాలి స్టౌ మీద బాణలిలో నూనె బాగా కాగాక మంట మీడియంలోకి తగ్గించి, తయారుచేసి ఉంచుకున్న రవ్వ అప్పాలను ఒక్కటొక్కక్కటిగా నూనెలో వేసి రెండువైపులా దోరగా వేయించాలి ఇవిసుమారు నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి. సేకరణ: డా.వైజయంతి