సాక్షి, చెన్నై : కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీ...ఈసారి భారీ మెజార్టీ సాధనే లక్ష్యంగా పెట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో విజయ బావుటా ఎగుర వేసేలా నిర్దేశించుకుంది.
ఇందుకోసం వివాదాల్లేని నేతల్ని లోక్‌సభ అభ్యర్ధులుగా బరిలోకి దించుతుంది. పార్టీకి బలమైన అభ్యర్థులు లేనిచోట్లా ఇతర పార్టీలకు చెందిన కీలక నాయకులు, సిట్టింగ్ ఎంపీలకు అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో ప్రస్తుతం గవర్నర్‌లుగా పనిచేస్తున్న ప్రముఖుల్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆహ్వానిస్తుంది.
తాజాగా తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్‌కు చెన్నై సౌత్ సీటును కేటాయించింది. ఈ మేరకు 9 మందితో తాజాగా విడుదల చేసిన మూడో జాబితాలో బీజేపీ అధిష్టానం తమిళిసైకి చోటు కల్పించింది. దీంతో తమిళసై సౌందరరాజన్ ఎవరు? అని ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తమిళిసై సౌందరరాజన్ ఎవరు?
- నగర్ కమ్యూనిటీ వర్గానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కుమారి అనంతన్ కుమార్తే తమిళిసై సౌందరరాజన్. వ్యాపారవేత్త..రాజకీయవేత్త హెచ్ వసంతకుమార్ మేనకోడలు.
- తమిళిసై సౌందరరాజన్ వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె గైనకాలజిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. సోనాలజీ, ఫీటల్ థెరపీలో ప్రత్యేక శిక్షణ పొందారు.
-
ఆమెకు చిన్నతనం నుంచే రాజకీయాలపై ఉన్న ఆసక్తితో మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతుండగా విద్యార్థి సంఘం నాయకురాలిగా పనిచేసి, బీజేపీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు.
-
1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001 లో తమిళనాడు రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, 2007 లో అఖిల భారత కో-కన్వీనర్ గా, 2007లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 2010లో తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా, 2013లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2014లో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా సేవలందించారు.
-
1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001లో మెడికల్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2005లో ఆల్ ఇండియా కో-కన్వీనర్ (దక్షిణాది రాష్ట్రాల వైద్య విభాగం)గా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా బీజేపీ రాష్ట్ర శాఖలో తమిళసై పనిచేశారు. 2007, 2010లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా, 2013లో జాతీయ కార్యదర్శిగా ఉన్నత బాధ్యలు చేపట్టారు.
-
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై 2006, 2011లో అసెంబ్లీ ఎన్నికల్లో 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయారు.
- సెప్టెంబర్ 2019లో తెలంగాణ గవర్నర్‌గా సౌందరరాజన్ నియమితులయ్యారు. కిరణ్ బేడీని తొలగించిన తర్వాత ఆమెకు పుదుచ్చేరి ఎల్‌జీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
- ఇప్పుడు తర్వలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు తమిళసై.
Comments
Please login to add a commentAdd a comment