
డీజీపీ మహేందర్‌రెడ్డిని పాఠశాలకు తోడ్కొని వస్తున్న విద్యార్థులు
సంస్థాన్‌నారాయణపురం: ‘నా ఎదుగుదలకు సర్వేల్ గురుకులం చదువే కారణం.. నా జీవితాన్ని మలుపు తిప్పిన గురుకులానికి గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో దేశం గర్వించే స్థాయిలో సేవలందిస్తున్నారు’ అని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలోని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు మంగళవారం నిర్వహించారు.
జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన డీజీపీ ఈ సందర్భంగా బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సర్వేల్ గురుకులంలో చేరకముందు సొంత ఊరు పక్కన ఉన్న జెడ్పీ హైస్కూల్లో చదివానని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా గురుకులాన్ని ప్రారంభించాలన్న పీవీ నరసింహారావు ఆలోచనలకు స్పందించిన నాటి సర్వోదయ నేత మద్ది నారాయణరెడ్డి తన 50 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారని చెప్పారు. ఇక్కడి నుంచే రాష్ట్రం, దేశ వ్యాప్తంగా గురుకుల విద్యా వ్యవస్థకు బీజం పడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment