
ముశిపట్లలో ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్
మోత్కూరు: బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయంగా తమ పార్టీ పని చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్ర గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడప గ్రామానికి చేరింది. ఈ సందర్భంగా పలువురు బీఎస్పీలో చేరగా వారికి ప్రవీణ్‌కుమార్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ముశిపట్ల గ్రామానికి యాత్ర చేరింది.
ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ ఉపాధిహామీ కూలీలతో మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బహుజనుల రాజ్యాధికారమే ధ్యేయంగా పని చేస్తున్న తనకు మీ మద్దతు అందించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, రవికుమార్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ బల్గూరి స్నేహ, మండల నాయకులు ప్రతాప్, బుశిపాక నాగరాజు, నవీన్, సురేశ్, ఉదయ్‌కిరణ్, అశోక్, భిక్షం, రాములు, బండి నరేశ్, అరుణ్, మల్లయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment