Employment laborers
-
బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయం
మోత్కూరు: బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయంగా తమ పార్టీ పని చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్ర గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడప గ్రామానికి చేరింది. ఈ సందర్భంగా పలువురు బీఎస్పీలో చేరగా వారికి ప్రవీణ్‌కుమార్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ముశిపట్ల గ్రామానికి యాత్ర చేరింది. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ ఉపాధిహామీ కూలీలతో మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బహుజనుల రాజ్యాధికారమే ధ్యేయంగా పని చేస్తున్న తనకు మీ మద్దతు అందించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, రవికుమార్, నియోజకవర్గ ఇన్చార్జ్ బల్గూరి స్నేహ, మండల నాయకులు ప్రతాప్, బుశిపాక నాగరాజు, నవీన్, సురేశ్, ఉదయ్‌కిరణ్, అశోక్, భిక్షం, రాములు, బండి నరేశ్, అరుణ్, మల్లయ్య పాల్గొన్నారు. -
మజ్జిగ లేదు.. నీళ్లు లేవు
►ఉపాధి కూలీలకు తీరని దాహం ► మజ్జిగ సరఫరాకు ముందుకు రాని పొదుపు సంఘాల మహిళలు ► గ్లాస్ మజ్జిగకు రూ.3 ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం ► భగ్గుమంటున్న పాల ధరలు బండిఆత్మకూరు: ఉపాధి కూలీలను వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగించేందుకు మజ్జిగను సరఫరా చేయాలన్న ప్రభుత్వ ఆశయానికి ఆదిలోనే హంసపాదు ఎదురవుతుంది. పొదుపు సంఘాల మహిళలు తమకు గిట్టుబాటు కాదని చేతులెత్తేశారు. దీంతో ఉపాధి కూలీలకు మజ్జిగను ఎలా సరఫరా చేయాలో తెలియక ఎంపీడీఓ కార్యాలయం అధికారులు, ఉపాధి పథకం అధికారులు తలలు పట్టుకున్నారు. ఉపాధి కూలీలకు మజ్జిగను సరఫరా చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాబినెట్లో తీర్మానించారు. ఇందుకు అనుగుణంగా మండల పరిషత్ అధికారులకు ఉత్తర్వులు అందాయి. మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో దాదాపు 2వేల మందికి పైగా ఉపాధి కూలీలు ఉన్నారు. దీంతో ప్రభుత్వం వీరికి ఒక గ్లాస్ మజ్జిగను ఒక ఉపాధి కూలీకి సరఫరా చేసేందుకు రూ.3 చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడానికి ఇటీవల ఏపీఓ శ్రీకళ ఆధ్వర్యంలో ఐకేపీ సిబ్బందిచే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వివిధ గ్రామైక్య సంఘాల లీడర్లు, సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. దీంతో ఏపీఓ సిబ్బంది ప్రభుత్వం నుంచి వచ్చిన మజ్జిగ పథకం గురించి వివరించారు. ఒక్కొక్క సభ్యురాలు 50 నుంచి 100 మంది ఉపాధి కూలీలకు మజ్జిగను సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. ఒక్క గ్లాస్‌కు కేవలం రూ.3 మాత్రమే చెల్లిస్తామని చెప్పారు. దీంతో పొదుపు సంఘాల మహిళలు తాము ఇంత తక్కువ ధరకు సరఫరా చేయడం సాధ్యం కాదని చేతులెత్త్తేశారు. ఎందుకు గిట్టుబాటు కాదంటే.. ప్రస్తుతం మార్కెట్లో లీటరు రూ.50, లీటరు పాలతో 20 గ్లాస్‌ల మజ్జిగ తయారవుతోంది. 20 గాస్ల్‌ల మజ్జిగ సరఫరా చేసేందుకు రూ.60 ఖర్చు ఉంది. ఇందుకు అదనంగా రూ.10 మాత్రం మిగులుతుంది. ఇలా 50 మందికి సరఫరా చేస్తే ప్రభుత్వం నుంచి ఒక్కో గ్లాస్‌కు (100ఎంఎల్)రూ.3 వస్తే రూ.150 చెల్లిస్తారు. అయితే ఇందులో పెట్టుబడిగా రెండున్నరల లీటర్ల పాలకు రూ.125 ఖర్చు అవుతుంది. దీంతో పెట్టుబడి పోను కేవలం రూ.25మాత్రమే వస్తుంది. గ్లాస్‌కు రూ.5 ఇవ్వాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో మజ్జిగను ఉపాధి కూలీలకు సరఫరా చేయాలంటే కనీసం గ్లాస్‌కు రూ.5 ఇవ్వాలి. ఇదే విషయమై ఇటీవల జరిగిన సమావేశంలో అధికారులకు తెలియజేశాం. అధికారులు, ప్రభుత్వం ఆ ధర ఇస్తేనే సరఫరా చేస్తాం. - లక్ష్మి, ఈర్నపాడు . పొదుపు మహిళలు ఒప్పుకోవడం లేదు ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనను తమ సంఘాల్లోని సభ్యులకు వివరించాం. అయితే మహిళా సభ్యులు ఇంత తక్కువ ధరకు సరఫరా చేయలేమని చెబుతున్నారు. పాలు, కుండలు, గ్లాస్లు కొని మజ్జిగను తయారు చేసి మహిళలే ఉపాధి కూలీల వద్దకు తీసుకెళ్లి పంపిణీ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నదని, రేటు పెంచాలని కోరుతున్నారు. - నూర్జహాన్, ఏ.కోడూరు ఐక్యసంఘం లీడర్ -
ప్రజలపై పట్టింపులేని కేసీఆర్
► తాగునీరు, పశుగ్రాసం అందించాలి ► సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఎల్కతుర్తి : కేంద్రం మూడు నెలలుగా ఉపాధి కూలీలకు డబ్బులు చెల్లించకుండా జాప్యం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ఎల్కతుర్తిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. పూటగడవడమే కష్టంగా మారిన కూ లీ ల బతుకులను చూసైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదని, కేసీఆర్‌కు ప్రజలంటే పట్టింపు లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రమంత టా కరువు తాండవిస్తోందని, తాగునీటి ఎద్ద డి నివారణకు జిల్లాకు రూ.250 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సబ్సిడీపై ప శుగ్రాసం అందించి నీటి కొలాయిలను నిర్మించాలన్నారు. కరువు మండలాల్లో ఇప్పటిదాకా సర్వే నిర్వహించకపోవడం సిగ్గుచేట న్నారు. ఆసరా పింఛన్ల డబ్బులను బ్యాంకు ఏజెంట్ల ద్వారా గ్రామాల్లోనే చెల్లించేలా చ ర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన రద్దుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, కేంద్రం పంతాలకు పో కుండా సహకరించాలని హితవు పలికారు. -
‘ఉపాధి’ సరే... వేతనమేది?
-ఉపాధి కూలీలకు తప్పని పాట్లు - అందని వేతనాలు - రూ.2.5 కోట్ల బకాయిలు నెల్లూరు(బారకాసు) : జిల్లాలో ఉపాధి హామీ బకాయిలు పేరుకుపోయాయి. కూలీలకు పని కల్పించడమే తమ బాధ్యత అన్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో కూలీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవని కారణంగా ఉపాధి కూలీలకు చేతినిండా పని దొరికింది. సీజన్ ప్రారంభంలో రోజుకు 25 వేల పనిదినాలు కల్పించగా, క్రమేణా ఈ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో సరాసరి రోజుకు 50 వేల నుంచి 60 వేల పనిదినాలు కల్పించారు. అడపాదడపా చినుకులు పడుతుండటంతో పనిదినాలు సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రోజుకు 30 వేల నుంచి 35 వేల పనిదినాలు కల్పిస్తున్నారు. తలనొప్పిగా మారిన స్మార్ట్ కార్డు జిల్లాలో 961 గ్రామాల పరిధిలోని కూలీలకు ఐసీఐసీఐ బ్యాంకు ద్వారానే వేతనాల చెల్లింపులు జరుపుతున్నారు. స్మార్ట్‌కార్డు ఉండి బయోమెట్రిక్ ద్వారానే వేతన చెల్లింపులు చేపడుతున్నారు. జిల్లాలో దాదాపు 23 వేల మందికి పైగా స్మార్ట్‌కార్డులు లేని వారున్నారు. వేతనాల చెల్లింపు స్మార్ట్‌కార్డులు అందక కొంత ఆలస్యమవుతుంటే.. సిబ్బంది కొరతను సాకుగా చూపి మరికొంత జాప్యం చేస్తున్నారు. చెల్లింపులో జాప్యం లేదని అధికారులు చెబుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 20 శాతం మంది కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఆయా కూలీలకు స్మార్ట్ కార్డులు లేకపోవడమే. వీటి జారీకి చర్యలు చేపట్టాల్సిన సంబంధిత శాఖాధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండలానికి సుమారు 300 మంది చొప్పున జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో స్మార్ట్ కార్డు అందక ఇబ్బందులు పడుతున్న కూలీలున్నారు. విడుదల కాని బకాయిలు జిల్లాలో నెల రోజుల్లో జరిగిన పనిదినాలకు సంబంధించి సుమారు రూ.2.5 కోట్ల మేర వేతన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను సాకుగా చూపి వేతన బకాయిల విడుదలలో తీవ్ర జాప్యమైంది. గత రెండు నెలల్లో రూ.19 కోట్ల విలువైన పనులు జరిగితే, గత నెల నిలిచిన వేతనాలకు సంబంధించి మొత్తం రూ.6.5కోట్లు కాగా, రూ.4 కోట్లు ఇటీవల విడుదలయ్యాయి. మిగి లిన బకాయిలు రూ.2.5 కోట్లు ఇంకా విడుదల కాలేదు. విడుదలైన బకాయిలను ఇప్పటికి 25 వేల మంది కూలీలకు అందచేయగా, 12 వేల మందికి అందజేసేందుకు చర్యలు చేపడుతున్నారు. మిగతా బకాయిలు కోసం 11 వేల మంది కూలీలు ఎదురు చూస్తున్నారు.