► తాగునీరు, పశుగ్రాసం అందించాలి
► సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
ఎల్కతుర్తి : కేంద్రం మూడు నెలలుగా ఉపాధి కూలీలకు డబ్బులు చెల్లించకుండా జాప్యం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ఎల్కతుర్తిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. పూటగడవడమే కష్టంగా మారిన కూ లీ ల బతుకులను చూసైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదని, కేసీఆర్‌కు ప్రజలంటే పట్టింపు లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రమంత టా కరువు తాండవిస్తోందని, తాగునీటి ఎద్ద డి నివారణకు జిల్లాకు రూ.250 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సబ్సిడీపై ప శుగ్రాసం అందించి నీటి కొలాయిలను నిర్మించాలన్నారు.
కరువు మండలాల్లో ఇప్పటిదాకా సర్వే నిర్వహించకపోవడం సిగ్గుచేట న్నారు. ఆసరా పింఛన్ల డబ్బులను బ్యాంకు ఏజెంట్ల ద్వారా గ్రామాల్లోనే చెల్లించేలా చ ర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన రద్దుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, కేంద్రం పంతాలకు పో కుండా సహకరించాలని హితవు పలికారు.
ప్రజలపై పట్టింపులేని కేసీఆర్
Published Sat, Apr 23 2016 3:15 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement