రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం తుది అలైన్‌మెంట్ మ్యాపు ఇదే
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి తొలి గెజిట్ (3ఎ) విడుదలైంది. ఈ ప్రాజెక్టు ఉత్తర భాగం 158.64కి.మీ.కు సంబంధించి కావాల్సిన భూసేకరణలో భాగంగా ఇటీవలే రాష్ట్రప్రభుత్వం ఎనిమిది మంది అధికారులతో అథారిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ సహా, చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, ఆందోల్, జోగిపేటల ఆర్డీఓలు ఈ అథారిటీ లో ఉన్నారు.
అయితే ఏయే గ్రామాల నుంచి భూమిని సేకరిస్తారో తెలుపుతూ గెజిట్‌ను ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు గురువారం విడుదల చేశారు. మొత్తం 113గ్రామాల పేర్లను ఇందులో పొందుపరిచారు. ఈ ఉత్తర భాగానికి సంబంధించి రూపొందించిన తుది అలైన్‌మెంటు మ్యాపును విడుదల చేశారు. ఈ భాగంలో మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఇతర రహదారులను రీజినల్ రింగురోడ్డు క్రాస్ చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో భారీ ఇంటర్ ఛేంజర్లను నిర్మిస్తారు. మ్యాపులో వాటిని నిర్మించే ప్రాంతాలను కూడా సూచించారు. త్వరలో 3ఏ(క్యాపిటల్) గెజిట్ కూడా విడుదల కానుంది. ఇందులో సర్వే నెంబర్ల వివరాలను పొందుపరచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment