gazette
-
ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలు విలీనం
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలోని 51 పంచాయితీలు సమీప మున్సిపాలిటీల్లో వీలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. గ్రామ పంచాయతీల విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇప్పటికే హైకోర్టు కొట్టేవేయడంతో పంచాయతీల విలీనానికి మార్గం సుగమమైంది. దీంతో గవర్నర్ అమోదంతో గెజిట్ జారీ అయ్యింది.ఓఆర్ఆర్ సమీపంలో ఉన్న మొత్తం 51 గ్రామ పంచాయతీలను విలీనానికి మంత్రివర్గం సబ్ కమిటీ సిఫారసు చేయగా, సెప్టెంబర్ 3న ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీల విలీనంతో ఔటర్ రింగు రోడ్డు పరిధి మొత్తం పూర్తి పట్టణ ప్రాంతంగా మారనుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 12 గ్రామాలను 4 మున్సిపాలిటీల్లో కలపగా అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 28 గ్రామాలను 7 మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 11 గ్రామాలను అక్కడి రెండు మున్సిపాలిటీల్లో ప్రభుత్వం విలీనం చేసింది.కాగా, హైదరాబాద్ చుట్టూ ఉన్న 51 గ్రామ పంచాయతీలను పరిసర మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ 3 సబబేనని తేల్చిచెప్పింది. విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కీసర మండలంలోని రాంపల్లి దాయార, కీసర, బోగారం, యాద్గారపల్లి గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.ఆయా గ్రామాలను మున్సిపాలిటీల నుంచి తొలగించి పంచాయతీలుగానే కొనసాగించాలని రాంపల్లి దాయారకు చెందిన మాజీ వార్డు మెంబర్ ముక్క మహేందర్, మాజీ సర్పంచ్ గంగి మల్లేశ్, మాజీ ఉప సర్పంచ్ కందాడి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఆయా గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది పూస మల్లేశ్, బి. హనుమంతు, మొల్గర నర్సింహ వాదనలు వినిపించారు.పైన పేర్కొన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో కలుపుతూ సెప్టెంబర్ 2, 2024న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.3ను వెంటనే రద్దు చేసి.. ఆ గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడమంటే భారత రాజ్యాంగంలోని 73వ రాజ్యాంగ సవరణ చట్టం నిబంధనలోని పార్ట్–9ని ఉల్లంఘించటమేనని వాదించారు. అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ఈ వాదనలను తప్పుబట్టారు. విలీనానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్లలో మెరిట్స్ లేవంటూ కొట్టివేసింది. -
రిజిస్ట్రేషన్‌కు బద్ధకిస్తున్నారు.. ఆ నిబంధన మార్చండి ప్లీజ్!
ప్రస్తుతం శాసనమండలి ఎన్నికలకు సంబంధించిన సందడి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నిక కోసం పట్టభద్రుల ఓటరు నమోదుకు ప్రభుత్వం ఈ నెల 6వ తేదిని ఆఖరు తేదీగా ప్రకటించింది. ఈ ఓటు హక్కు కోసం 2021లోపు డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని ప్రకటించింది. ఆ యా పార్టీల అభ్యర్థులు, వ్యాపార సంస్థల నుండి పట్టభద్రులుగా ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలనుకునే వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఓ సెల్ నెంబరు ద్వారా ఓటు నమోదు కోసం గ్రాడ్యుయేట్లను కోరుతున్నారు. అయితే పట్టభద్రులు తమ ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం తప్పనిసరి కావడంతో... చాలామంది రిజిస్ట్రేషన్‌కు వెళ్లడానికి బద్ధకిస్తున్నారు.వాస్తవానికి ఓటు హక్కును సులువుగా ఉపయోగించుకునేలా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటే బాగుండేది. అలా చేయకపోవడం వల్ల అనేక మంది పట్టభద్రులు ప్రత్యేకంగా ఆన్లైన్ సెంటర్లకు వెళ్లి ఓటు నమోదు చేసుకోడానికి సమయం వెచ్చించడం లేదు. పట్టభద్రుల ఓటు నమోదు కోసం ఉంచిన వెబ్ సైట్లో డిగ్రీ ధ్రువపత్రం, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు నంబర్లను నమోదు చేసినా... మళ్లీ గెజిటెడ్ స్థాయి అధికారి సంతకంతో ధ్రువీకరించిన పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాలనే షరతు చికాకు కలిగిస్తోంది. అందుకే చాలామంది తమ ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి ఆసక్తి చూపడంలేదు.చదవండి: స్టూడెంట్ లీడర్ టు సీఎం.. రేవంత్ రెడ్డి రాజకీయ పొలిటికల్ జర్నీఒకవేళ ఇదే మంచి ఆలోచన అని ప్రభుత్వం భావించినప్పుడు ఆ యా మండల స్థాయిలోనే ఒకరిద్దరు గెజిటెడ్ స్థాయి అధికారులను ఉంచి, అక్కడే ఓటు హక్కును ప్రభుత్వమే నమోదు చేస్తే బాగుండేది. ఈ విషయాన్ని అటు ఎన్నికల కమిషన్, ఇటు ప్రభుత్వం మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్ని షరతులు ఉన్నా... వాటిని అధిగమించి తమ ఓటును రిజిస్టర్ చేసుకోవాలి. మంచి ప్రతినిధిని ఎన్నుకుని గొప్ప భవిష్యత్తుకు బాటలు వేయాలి.– సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా -
Telangana: హైడ్రాకు చట్టబద్దత.. ఆర్డినెన్స్ జారీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ(హైడ్రాకు) చట్టబద్దత కల్పిస్తూ ప్రభుత్వం నేడు(శనివారం) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు మున్సిపల్ చట్టంలో మార్పులు చేసింది రేవంత్ సర్కార్.హైడ్రాకు చట్టబద్దత కల్పించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం చట్టబద్దత కోసం ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపగా.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా సంతకం చేశారు. ఇక ఆర్డీనెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం తాజాగా గెటిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. కాగా చెరువుల పరిరక్షణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎస్ అధికారి రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా ఉన్నారు. హైడ్రా గత రెండు నెలలుగా చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తోంది. పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చర్చనీయాంశంగా మారాయి. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సహా పలు నిర్మాణాలను కూల్చివేసింది.చదవండి: అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన -
కృష్ణా ప్రాజెక్టులపై గెజిట్‌ను రద్దు చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పొందుపర్చిన ఆరు ప్రాజెక్టులకు రక్షణ కల్పిస్తూ గత ఏడాది జూలై 27న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోఫికేషన్‌కు చట్టబద్ధత లేదని, దానిని తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. బేసిన్ వెలుపల ఉన్న ఏపీలోని నాలుగు ప్రాజెక్టులకు ఎలాంటి నీటి కేటాయింపులు లేకున్నా.. అనుమతుల నుంచి మినహాయింపు కల్పించడం సరికాదని స్పష్టం చేసింది. నీటి కేటాయింపులు జరిపే అధికారం కేవలం ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉందని పేర్కొంది. పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టుల జాబితా అసంపూర్తిగా ఉందని.. 2002 నుంచే వినియోగంలో ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును అందులో చేర్చలేదని వివరించింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయాలను ప్రభావితం చేసేలా ఉన్న ఈ గెజిట్‌ను రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తెలంగాణకు అన్యాయం.. కృష్ణా జలాల వినియోగంలో ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టం కింద కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. ఆ బోర్డుకు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో కృష్ణానదిపై తెలంగాణలోని కల్వ కుర్తి (అదనపు 15 టీఎంసీల సామర్థ్యం పెంపు), నెట్టెంపా డు (సామర్థ్యం పెంచనిది)తోపాటు ఏపీలోని తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ఎత్తిపోతల పథకా లను అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది. వీటికి ఏడాదిలోగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని పే ర్కొంది. కానీ కేంద్రం వీటిని విభజన చట్టంలో 11వ షెడ్యూ ల్లో పొందుపరిచి, పూర్తి చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. మళ్లీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లే దంటూ గత ఏడాది జూలై 27న సవరణ గెజిట్ జారీ చేసింది. అయితే.. ఇలా మినహాయింపు పొందిన ప్రాజెక్టుల్లో తెలంగాణలోని రెండే ప్రాజెక్టులు ఉండగా, ఏపీలోని 4 ప్రాజె క్టులు ఉండటంపై తెలంగాణ తాజాగా అభ్యంతరం తెలిపింది. కృష్ణా బేసిన్ పరిధిలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను కోరుతూ కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపి స్తున్నామని.. ఈ సమయంలో బేసిన్ వెలుపల ఉన్న ఏపీలో ని 4 ప్రాజెక్టులకు మినహాయింపు ఇస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయమని ఆందోళన వ్యక్తం చేసింది. బేసిన్ పరిధిలోని పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు అ నుమతుల కోసం చేస్తున్న ప్రయత్నాలకు గెజిట్ నోటిఫికేషన్ అడ్డంకిగా మారే అవకాశం ఉందని పేర్కొంది. కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు కోరుతు న్నామని తెలిపింది. -
షినవత్రకు థాయ్‌లాండ్ రాజు క్షమాభిక్ష
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాజీ ప్రధానమంత్రి థక్సిన్ షినవత్ర(74)కు రాజు క్షమాభిక్ష ప్రసాదించారు. అవినీతి ఆరోపణలపై ఆయనకు కోర్టు విధించిన ఎనిమిదేళ్ల జైలు శిక్షను ఒక్క ఏడాదికి తగ్గించారు. ఇందుకు సంబంధించి రాజు మహా వజ్రాలొంగ్కర్న్ నిర్ణయాన్ని రాయల్ గజెట్ శుక్రవారం ప్రచురించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దేశంలో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే అంతిమ అధికారం రాజుదే. 2001, 2005ల్లో జరిగిన ఎన్నికల్లో షినవత్ర ప్రధాని అయ్యారు. 2006లో జరిగిన సైనిక కుట్రలో ప్రధాని పదవి నుంచి షినవత్రను గద్దె దించారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2008లో ఆయన దేశం విడిచి వెళ్లిపోయి, అజ్ఞాతంలో గడిపారు. వారం క్రితం దేశంలోకి ప్రవేశించిన వెంటనే అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆరోగ్యం క్షీణిస్తున్నందున క్షమాభిక్ష కోరుతూ రాజుకు విజ్ఞాపన పంపారు. షినవత్ర రాకతో దేశంలో మూడు నెలలుగా నెలకొన్న రాజకీయ అస్థిరత సమసిపోయే పరిణామాలు సంభవించాయి. షినవత్ర స్థాపించిన ఫ్యూథాయ్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా పార్లమెంట్లో మద్దతు పెరగడం విశేషం. -
RRR First Gazette: రీజినల్ రింగ్ రోడ్డు తొలి గెజిట్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి తొలి గెజిట్ (3ఎ) విడుదలైంది. ఈ ప్రాజెక్టు ఉత్తర భాగం 158.64కి.మీ.కు సంబంధించి కావాల్సిన భూసేకరణలో భాగంగా ఇటీవలే రాష్ట్రప్రభుత్వం ఎనిమిది మంది అధికారులతో అథారిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ సహా, చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, ఆందోల్, జోగిపేటల ఆర్డీఓలు ఈ అథారిటీ లో ఉన్నారు. అయితే ఏయే గ్రామాల నుంచి భూమిని సేకరిస్తారో తెలుపుతూ గెజిట్‌ను ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ అధికారులు గురువారం విడుదల చేశారు. మొత్తం 113గ్రామాల పేర్లను ఇందులో పొందుపరిచారు. ఈ ఉత్తర భాగానికి సంబంధించి రూపొందించిన తుది అలైన్‌మెంటు మ్యాపును విడుదల చేశారు. ఈ భాగంలో మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఇతర రహదారులను రీజినల్ రింగురోడ్డు క్రాస్ చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో భారీ ఇంటర్ ఛేంజర్లను నిర్మిస్తారు. మ్యాపులో వాటిని నిర్మించే ప్రాంతాలను కూడా సూచించారు. త్వరలో 3ఏ(క్యాపిటల్) గెజిట్ కూడా విడుదల కానుంది. ఇందులో సర్వే నెంబర్ల వివరాలను పొందుపరచనున్నారు. -
‘కృష్ణా, గోదావరి’ గెజిట్ అమల్లో ముందడుగు
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలులో ముందడుగు పడింది. కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాల్లో ప్రాజెక్టుల వివరాలన్నీ తక్షణమే ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏయే ప్రాజెక్టులను బోర్డులు ఆదీనంలోకి తీసుకుని నిర్వహించాలన్నది తేలాకనే సీఐఎస్ఎఫ్ భద్రతపై చర్చిద్దామని తెలిపాయి. ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీగా డిపాజిట్ చేసే అంశాన్ని ప్రభుత్వాలతో చర్చించాకనే వెల్లడిస్తామని రెండు రాష్ట్రాల అధికారులు స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు ఇచ్చే అంశాల ఆధారంగా బోర్డు స్వరూపాలను ఖరారు చేసి బోర్డులకు అందజేస్తామని ఉపసంఘాల కన్వీనర్లు తెలిపారు. బోర్డు పరిధి, స్వరూపాన్ని ఖరారు చేసేందుకు వేర్వేరుగా కృష్ణా, గోదావరి బోర్డులు ఉపసంఘాలను నియమించాయి. ఈ రెండు ఉపసంఘాలు శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో వేర్వేరుగా సమావేశమయ్యాయి. కృష్ణా బోర్డు ఉప సంఘానికి రవికుమార్ పిళ్లై, గోదావరి బోర్డు ఉప సంఘానికి బీపీ పాండే నేతృత్వం వహిస్తున్నారు. ఈ ఉప సంఘాల సమావేశాల్లో బోర్డు సభ్యులు, ఏపీ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ సీఈ మోహన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. 23లోగా వివరాలు ఇవ్వాల్సిందే తొలుత కృష్ణా బోర్డు ఉప సంఘం సమావేశం జరిగింది. ప్రాజెక్టుల వివరాలను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అందజేసింది. తెలంగాణ అధికారులు ఈనెల 23లోగా ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫరి్నచర్‌తో సహా అన్ని వివరాలను అందిస్తూనే వాటి పరిధిలో పనిచేసే ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను అందజేయాలని ఉపసంఘం కన్వీనర్ రవికుమార్ పిళ్లై ఆదేశించారు. వాటితోపాటే నిర్మాణంలోని ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన వివరాలు, వాటి బాధ్యతలు చూస్తున్న ఏజెన్సీల జాబితా, వాటి నిర్వహణకు చేస్తున్న ఖర్చుల వివరాలు ఇవ్వాలని కోరారు. శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటిని విడుదల చేసేటప్పుడు లెక్కిస్తున్న నేపథ్యంలో.. దాని దిగువన ఉన్న బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌ను బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఏపీ సీఈ శ్రీనివాసరెడ్డి చెప్పగా.. తెలంగాణ సీఈ మోహన్‌కుమార్ వ్యతిరేకించారు. గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు అన్ని వివరాలు అందజేయాలని కన్వీనర్ రవికుమార్ పిళ్లై కోరారు. 20న మళ్లీ గోదావరి బోర్డు ఉపసంఘం భేటీ గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల వివరాలన్నీ ఏపీ అధికారులు ఇప్పటికే బోర్డుకు అందజేశారు. తెలంగాణ అధికారులు ఇప్పటిదాకా ప్రాజెక్టుల వివరాలు ఇవ్వకపోవడంతో.. తక్షణమే అందజేయాలని గోదావరి బోర్డు ఉపసంఘం కన్వీనర్ బీపీ పాండే ఆదేశించారు. గెజిట్ నోటిఫికేషన్‌ను అక్టోబర్ 14 నుంచి అమలు చేయాల్సిన నేపథ్యంలో బోర్డు పరిధి, స్వరూపాన్ని తక్షణమే ఖరారు చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో 20న మళ్లీ ఉపసంఘం సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. -
ఇకపై ఏపీ ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: ఏపీ ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా ఏపీ ఈ-గెజిట్‌లో ఉత్తర్వులను ఉంచనున్నన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్‌లో ఉంచబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. చదవండి: పీఎంఏజీవై అవార్డులకు ఏపీలోని రెండు జిల్లాలు ఎంపిక -
నిధులపై నీళ్లు.. సాగునీటి ప్రాజెక్టులపై గెజిట్ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కొరత వెంటాడుతోంది. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల పరిధిలో భారీగా బకాయిలు పేరుకుపోగా.. కృష్ణా, గోదా వరి బోర్డులపై కేంద్రం తీసుకొచ్చిన గెజిట్‌తో కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. అనుమతుల్లేవని చెబుతున్న ప్రాజెక్టులకు రుణాల విడుదలలో రుణ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు నిధుల విడుదలను నిలిపివేయడంతో, ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు నిర్ణీత గడువులోగా చేరుకునే పరిస్థితి లేకుండా పోతోంది. పేరుకుపోయిన బకాయిలు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో గతంలో ఎన్నడూ లేనంతగా బకాయిలు పేరుకుపోయాయి. కరోనా ప్రభావంతో రాష్ట్ర ఆదాయానికి గండి పడటం, మరోవైపు ఇతర ప్రాధాన్యత రంగాలకు నిధుల వెచ్చింపు పెరగడంతో ప్రాజెక్టులకు రాష్ట్ర నిధుల నుంచి కేటాయింపులు తగ్గాయి. కొత్త ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులపై రూ.4,925 కోట్లు వెచ్చించగా, ఇందులో రాష్ట్ర నిధుల నుంచి ఇచ్చింది కేవలం రూ.1,887 కోట్లు మాత్రమే. ఇక రుణాల రూపేణా వచ్చిన సొమ్ముతో మరో రూ.3,038 కోట్లు మేర ఖర్చు చేశారు. అయినప్పటికీ ఇంకా రూ.11,396 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో నిర్మాణ పనులు (వర్క్స్)కు సంబంధించిన బిల్లులే రూ.5,710 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. పనులకు సంబంధించిన బకాయిల్లో కాళేశ్వరం పరిధిలోనే రూ.1,200 కోట్ల మేర చెల్లించాల్సి ఉండగా, మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిధిలోనివి రూ.300–400 కోట్ల వరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రిజర్వాయర్ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా, చివరి దశలో ఉన్న పనులకు నిధుల కొరత కారణంగా కనీసం డీజిల్ ఖర్చులకు సైతం ఇక్కట్లు తప్పట్లేదు. పాలమూరు–రంగారెడ్డి పరిధిలో మరో రూ.2 వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. జూలై తొలివారం వరకు వచ్చిన నిధులు ప్రాజెక్టులకు నిధుల కొరత రావద్దనే ఉద్దేశంతోనే కాళేశ్వరం కార్పొరేషన్, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్లకు ప్రైవేటు బ్యాంకులతో పాటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, నాబార్డ్ వంటి సంస్థలు రుణాలిస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది జూలై తొలివారం వరకు కాళేశ్వరానికి రూ.1,624 కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ.1,039 కోట్లు, కంతనపల్లికి రూ.40 కోట్లు, దేవాదులకు రూ.127 కోట్లు, సీతారామకు రూ.136 కోట్లు మేర రుణాలు విడుదలయ్యాయి. అయినప్పటికీ కాళేశ్వరం, పాలమూరుతో పాటు సీతారామలో పనులకు సంబంధించి రూ.563 కోట్లు, దేవాదులలో రూ.10 కోట్లు బకాయిలున్నాయి. మున్ముందు పనులకు రూ.2 వేల కోట్ల మేర నిధుల అవసరాలున్నాయి. గెజిట్‌తో రుణ సంస్థల వెనుకంజ ప్రస్తుతం కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ల కారణంగా రుణ సంస్థలు రుణాల విడుదలపై సందిగ్ధంలో పడ్డాయి. అనుమతుల్లేని ప్రాజెక్టులు, వాటికి అనుమతుల విషయమై గెజిట్‌లో కేంద్రం పలు సూచనలు చేసిన నేపథ్యంలో రుణాల విడుదలపై సంస్థలు వెనుకంజ వేస్తున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, సీతమ్మసాగర్ బ్యారేజీ వంటి ప్రాజెక్టులకు కేంద్ర సంస్థల నుంచి అనుమతి తీసుకోవాలని గెజట్లో పేర్కొన్న నేపథ్యంలో రుణ సంస్థలు ఈ అంశాలపై రాష్ట్రానికి ప్రశ్నలు సంధిస్తున్నాయి. ప్రాజెక్టులకు ఆమోదం ఎప్పటిలోగా తీసుకుంటారు, ఒకవేళ అనుమతులు రాకుంటే పరిస్థితి ఏంటీ, రుణాల చెల్లింపు విషయంలో ప్రభుత్వ విధానం ఏంటని ఆరా తీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గెజిట్ వెలువడిన నాటి నుంచి కార్పొరేషన్లకు రుణ సంస్థలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు నాబార్డ్ నుంచి రూ.400 కోట్ల మేర రావాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితులతో వాటిని వాయిదా వేస్తోంది. ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ రుణాలే కీలకం కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మేర రుణాలు లభిస్తాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది. -
ఫాస్టాగ్ ఉంటేనే రాయితీలు
సాక్షి, హైదరాబాద్: టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లించే విధానాన్ని త్వరలోనే పూర్తిగా నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. టోల్ రుసుము మొత్తం ఫాస్టాగ్ విధానంలో చెల్లించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫాస్టాగ్ మొదలైన తర్వాత కూడా ఇంకా 40 శాతం మంది వాహనదారులు టోల్ ఫీజును నగదు రూపంలో చెల్లిస్తున్నారు. దీన్ని పూర్తిగా నియంత్రించి క్రమంగా వాహనదారులంతా ఫాస్టాగ్ పొందేలా కొన్ని నెలలుగా ముమ్మ రంగా ప్రచారం చేస్తోంది. అయినప్పటికీ వాహనదారుల్లో ఇంకా ఆశించిన స్థాయి స్పందన ఉండడం లేదని భావిస్తున్న కేంద్రం ఉపరితల రవాణా శాఖ క్రమంగా నగదు చెల్లించేవారిని నియంత్రించేందుకు కొత్త మార్గాలు ఎంచుకుంటోంది. ఈ క్రమంలోనే టోల్ చెల్లింపులో ఉన్న రాయితీలన్నింటినీ కేవలం ఫాస్టాగ్ చెల్లింపుదారులకే పరిమితం చేయాలని నిర్ణయించించింది. వాస్తవానికి ఈ నిర్ణయం లాక్డౌన్ కంటే ముందే తీసుకున్నా దాని అమలు పూర్తిస్థాయిలో ప్రారంభించలేదు. తాజాగా దీనికి సంబంధించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఓ గెజిట్ విడుదల చేసింది. దీన్ని కచ్చితంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల్లోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులను కేంద్రం ఆదేశించింది. రాయితీలు ఇవే.. ⇒ 24 గంటల్లో వస్తే తగ్గింపు హుళక్కే టోల్గేట్ దాటిన ఇరవై నాలుగు గంటల్లోనే తిరుగుప్రయాణంలో వస్తే రాయితీ ఉంది. తిరుగు ప్రయాణపు టోల్ చార్జీలో 50 శాతం రాయితీ ఉంటుంది. ఇప్పటివరకు వాహనదారులంతా ఇది పొందుతున్నారు. ఇక నుంచి ఫాస్టాగ్ ఉన్న వాహనదారులు మాత్రమే దీన్ని పొందే అవకాశం ఉంది. ఫాస్టాగ్ లేకుండా నగదు ద్వారా టోల్ ఫీజు చెల్లించే వాహనదారులు పూర్తి చార్జీని భరించాల్సిందే. ⇒ లోకల్ డిస్కౌంట్ కూడా.. టోల్‌గేట్‌కు 10 కిలోమీటర్ల పరిధిలో ఉండే వాహనదారులకు ప్రత్యేక లోకల్ డిస్కౌంట్ వసతి ఉంది. టోల్ రుసుములో నిర్ధారిత మొత్తం రాయితీ రూపంలో తగ్గింపు లభిస్తుంది. దాన్ని స్థానికులు పొందుతున్నారు. ఇప్పుడు ఇది కూడా ఫాస్టాగ్ ఉంటేనే పొందే అవకాశం ఉంది. ⇒ నెలవారీ పాస్‌కు ఫాస్టాగ్ క్రమంగా టోల్ గేట్లు ఉన్న రోడ్లపై ప్రయాణించేవారు నెలవారీ పాస్‌లు పొందు తుంటారు. ఒకేసారి నెల చార్జీ చెల్లిస్తుండడంతో టోల్‌లో కొంత తగ్గుదల ఉంది. ఇప్పుడు ఆ పాస్‌లను కేవలం ఫాస్టాగ్ ఉన్నవారికి మాత్రమే ఇస్తారు. మిగతా వారు ఏరోజుకారోజు చెల్లించాల్సిందే. దీంతో వారికి టోల్ భారం పెరుగుతుంది. ⇒ త్వరలో అన్ని గేట్లూ ఫాస్టాగ్‌కే నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం రహదారులపై టోల్ ఫీజు విషయంలోనూ దాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతోపాటు రోడ్లపై నగదు రూపంలో టోల్ చెల్లించాల్సి రావడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీన్ని నియంత్రించి గేట్ల వద్ద వాహనాలు నిలపాల్సిన పని లేకుండా ఫాస్టాగ్ విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే -
‘బ్రిజేష్ తీర్పు నోటిఫై’ పై మీ వైఖరేమిటి?
-
‘బ్రిజేష్ తీర్పు నోటిఫై’ పై మీ వైఖరేమిటి?
కృష్ణా జలాల కేటాయింపులపై తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, కేంద్రానికి సుప్రీం నోటీసులు ఏపీ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్‌కు ఆదేశం విచారణ 8 వారాలకు వాయిదా న్యూఢిల్లీ : కృష్ణా జలాల కేటాయింపుపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును గెజిట్‌లో నోటిఫై చేయకూడదన్న ఆంధ్రప్రదేశ్ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల వైఖరేమిటో తెలపాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఈమేరకు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసి, విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. కృష్ణా జలాల కేటాయింపులో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2010లో ప్రకటించిన అవార్డు తమ ప్రయోజనాలకు భంగకరంగా ఉందని, దాని అమలు నిలిపివేయాలని కోరుతూ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవార్డును కేంద్రం గెజిట్‌లో నోటిఫై చేయకూడదని కూడా ఆదేశించింది. గత ఏడాది నవంబరులో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పును ప్రకటించింది. ఇందులో కూడా తమకు అన్యాయం జరిగిందని, దీనిని గెజిట్‌లో ప్రచురించకూడదని ఈ ఏడాది జనవరిలో మరోసారి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డును త్వరగా గెజిట్‌లో ప్రచురించాలని సుప్రీం కోర్టును కోరింది. ఈ కేసు బుధవారం జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయ, జస్టిస్ ప్రఫుళ్ల చంద్రపంత్లతో కూడిన ధర్మాసనం ముందుకు మరోసారి విచారణకు వచ్చింది. ఈ కేసులో ఏదైనా మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయా అని న్యాయమూర్తి జస్టిస్ ముఖోపాధ్యాయ ప్రశ్నించారు. గెజిట్‌లో ప్రచురించకూడదని మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయని , తుది అవార్డు వచ్చినప్పటికీ, నోటిఫై కాలేదని కర్ణాటక న్యాయవాది నారీమన్ వివరించారు. ఈ సమయంలో ఏపీ న్యాయవాది ఎ.కె.గంగూలీ కల్పించుకుని ‘నోటిఫై చేయాలంటూ మహారాష్ట్ర దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం నోటీసులు జారీచేసింది. మేం వేసిన పిటిషన్లపై ఇంకా నోటీసులు ఇవ్వలేదు. రాష్ట్ర విభజన కారణంగా తిరిగి కేటాయింపులు జరపాల్సి ఉంది’ అని చెప్పారు. దీంతో ఏపీ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు తమకు సమ్మతం కాదని, కొత్తగా కేటాయింపులు జరపాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ దాఖలు చేసింది. -
ఆ గెజిట్ రీషెడ్యూల్ కోసమేనా!
ప్రొద్దుటూరు: వరదలు వచ్చి 8 నెలలైంది. ప్రస్తుతం వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వరద నష్టంపై గెజిట్ విడుదల చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది తుపాన్ ప్రభావం కారణంగా జరిగిన నష్టంపై ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. జిల్లాకు సంబంధించి 41 మండలాల పరిధిలోని 308 రెవెన్యూ గ్రామాల్లో వరద నష్టం జరిగినట్లు ఈ జాబితాలో పేర్కొన్నారు. గ్రామాల వారిగా వివరాలను గెజిట్‌లో ప్రకటించారు. ఈ ప్రకారం ఈ మండలాలను వరద ప్రభావిత మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. పంట రుణాల రీషెడ్యూల్ కోసమే ప్రభుత్వం ఈ గెజిట్‌ను తయారు చేసిందనే చర్చ జరుగుతోంది. గత ఏడాది అక్టోబర్‌లో పాలిన్ తుపాన్ ప్రభావం కారణంగా భారీ వర్షాలు పడ్డాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ నష్టాన్ని ప్రకటించలేదు. అక్టోబర్‌లో వరదలు వచ్చినా ఇంత కాలం దీని ఊసేలేదు. కాగా అక్టోబర్ 8 నుంచి 27వ తేదీ వరకు పాలిన్ తుపాన్ ప్రభావం కారణంగా జిల్లాలో ప్రాణనష్టం, పశుసంపద నష్టం, ఇళ్ల నష్టం, పంట నష్టం, ఉద్యానవన, మత్స్యశాఖ, రోడ్లు మరియు భవనాలు, గ్రామీణ తాగునీటి సరఫరా తదితర శాఖలకు సంబంధించి నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌లోని విపత్తు నిర్వహణ మండలి వారు సూచించిన మేరకు జిల్లాలోని 41 మండలాల పరిధిలో ఉన్న 308 రెవెన్యూ గ్రామాల్లో ఈ నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది జూన్ 13న ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. రీ షెడ్యూల్ కోసమేనా! పంట రుణాల రీ షెడ్యూల్ కోసమే ప్రభుత్వం ముందస్తు వ్యూహంతో ప్రకృతి వైపరీత్యాల కింద నష్టం జరిగినట్లు గెజిట్‌ను ప్రచురించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వ్యవసాయ రుణాలను మాఫీ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా జూన్ 8వ తేదీన చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారంలో తొలి సంతకం చేసినట్టే చేసి సాధ్యాసాధ్యాల కోసం కోటయ్య కమిటీని నియమించారు. కొన్ని షరతులకు బ్యాంకర్లు అంగీకరించకపోవడంతో ప్రభుత్వం ఈ అంశంపై శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తోంది. మరో వైపు గడువు మీరిపోవడంతో రైతులు నష్టపోయే అవకాశం ఉంది. గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 661 మండలాలకుగాను 113 మండలాల్లో కరువు, 462 మండలాల్లో తుపాన్ ప్రభావానికి గురయ్యాయని ప్రకటించారు. కరువు తుపానులు వచ్చిన నేపథ్యంలో పంట రుణాలు రీషెడ్యూల్ చేయాలని ఆయన కోరారు. దీనిని బట్టి ప్రభుత్వం వ్యూహం ప్రకారం గెజిట్‌ను విడుదల చేయించినట్లు తెలుస్తోంది. -
ఖరారు..తకరారు
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ :జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్లకు సంబంధించి గురువారం రాత్రి గెజిట్ విడుదల చేశారు. 20, 21 నెంబరుతో గెజిట్ విడుదల చేసినప్పటి కీ రిజర్వేషన్ల ఖరారు మాత్రం కొలిక్కి రాలేదు. జిల్లాలో 58 జెడ్పీటీసీలు, 1052 ఎంపీటీసీలు రిజర్వేషన్ల ఖరారు కోసం గత మూడురోజులుగా జెడ్పీ కార్యాలయంలో అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. బుధవారం రాత్రికల్లా ఈ కసరత్తు పూర్తి చేసి గురువారం అధికారిక ప్రకటన (గెజిట్) విడుదల చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఇచ్చిన గడువు పూర్తి కావడంతో కసరత్తు పూర్తికాకుండానే రిజర్వేషన్లకు సంబంధించి గెజిట్ విడుదల చేసినట్టు అధికారులు పకటించారు. శుక్రవారం ఉదయానికల్లా ఈ కసరత్తు ఒక కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా గత నాలుగేళ్లుగా పనిచేస్తున్న సుమారు 50 మంది ఎంపీడీఓలు ఇటీవలే ఎన్నికల బదిలీల్లో భాగంగా ఇతర జిల్లాలకు బదిలీ కావడంతో వారి స్థానంలో కొత్తవారు బాధ్యతలు చేపట్టారు. వీరికి జిల్లాపై కనీస అవగాహన లేకపోవడం, ఎంపీటీసీల పునర్విభజన కసరత్తుపై అనుభవం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని జెడ్పీ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు. దీనికితోడు జెడ్పీ సీఈఒగా బదిలీపై వచ్చిన సూర్యభగవాన్ రిజర్వేషన్ల ఖరారులో ఎలాం టి లోటుపాట్లు లేకుండా ఉండాలన్న భావనతో ప్రతి చిన్న అంశంపైనా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ జరుగుతుంది. మొత్తం స్థానాల్లో 50 శాతం మహిళలకు కేటాయించాల్సి ఉండగా, ఆయా వర్గాల జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ స్థానాల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. -
తెలంగాణపై గెజిట్ విడుదల
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు చట్టరూపం దాల్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర హోం శాఖ వెబ్సైట్లో వివరాలను పొందుపరచారు. మొత్తం 70 పేజీలతో చట్టం రూపొందించారు. మార్చి 1, 2014న గెజిట్ విడుదల చేసినట్టు పేర్కొంది. తెలంగాణ బిల్లును పార్లమెంట్ ఉభయ సమావేశాలు ఆమోదించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా దీనికి ఆమోద ముద్ర వేశారు. ఇక అపాయింటెడ్ డేట్ విడుదల మాత్రమే మిగిలుంది. మూడునెలల తర్వాత అపాయింటెడ్ డేట్ ప్రకటించవచ్చని సమాచారం. ఆ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రం అధికారంగా ఏర్పాటవుతుంది.