సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ(హైడ్రాకు) చట్టబద్దత కల్పిస్తూ ప్రభుత్వం నేడు(శనివారం) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు మున్సిపల్ చట్టంలో మార్పులు చేసింది రేవంత్ సర్కార్.
హైడ్రాకు చట్టబద్దత కల్పించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం చట్టబద్దత కోసం ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపగా.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా సంతకం చేశారు.
ఇక ఆర్డీనెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం తాజాగా గెటిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.
కాగా చెరువుల పరిరక్షణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎస్ అధికారి రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా ఉన్నారు.
హైడ్రా గత రెండు నెలలుగా చెరువులు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తోంది. పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చర్చనీయాంశంగా మారాయి. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సహా పలు నిర్మాణాలను కూల్చివేసింది.
Comments
Please login to add a commentAdd a comment